ఓదెల మల్లన్నకు మొక్కులు | - | Sakshi
Sakshi News home page

ఓదెల మల్లన్నకు మొక్కులు

Oct 5 2026 1:33 AM | Updated on Oct 5 2026 1:33 AM

ఓదెల: ఓదెల మల్లికార్జునస్వామి దేవస్థానంలో భక్తులు ఆదివారం ప్రత్యేక పూజలు, చేశా రు. పట్నాలు వేశారు. తొలుత కోనేరులో పు ణ్య స్నానాలను ఆచరించారు. మల్లికార్జునస్వామి, శ్రీసీతారామచంద్రస్వామి, నందీశ్వరులను దర్శనం చేసుకున్నారు. పూజారుల నుంచి తీర్థప్రసాదాలు స్వీకరించారు. హుండీ లో కానుకలు వేశారు. జూనియర్‌ అసిస్టెంట్‌ కుమారస్వామి ఏర్పాట్లు పర్యవేక్షించారు.

పెద్దమ్మతల్లికి వెండి ఆభరణం

కాల్వశ్రీరాంపూర్‌: పందిల్ల గ్రామానికి చెందిన భక్తుడు పోతరవేన వెంకటేశ్‌ దంపతులు స్థానిక పెద్దమ్మతల్లి అమ్మవారికి రూ.లక్ష విలువైన వెండి వడ్డాణం హూకరించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు.

ఉత్సాహంగా అథ్లెటిక్స్‌ పోటీలు

పెద్దపల్లి: సుల్తానాబాద్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో ఆదివారం నేషనల్‌ ఇంటర్‌ డిస్ట్రిక్ట్‌ జూనియర్‌ అథ్లెటిక్స్‌ మీట్‌ ఎంపిక పోటీలు నిర్వహించారు. అండర్‌–14, అండర్‌–16లో బాలబాలికలు ఉత్సాహంగా పాల్గొ ని ప్రతిభ చాటారు. రాష్ట్ర అబ్జర్వర్‌, రాజన్న సిరిసిల్ల జిల్లా జనరల్‌ సెక్రటరీ భోజ చంద్రశేఖర్‌ పోటీలు ప్రారంభించారు. ఎంపికైన 13మంది క్రీడాకారులు నవంబరు 14 నుంచి 16 వరకు హైదరాబాద్‌లో నిర్వహించే నేషనల్‌ ఇంటర్‌ డిస్ట్రిక్ట్‌ జూనియర్‌ అథ్లెటిక్స్‌ మీట్‌లో పాల్గొంటారని అసోసియేషన్‌ కార్యదర్శి గట్టయ్య తెలిపారు. కోశాధికారి జావిద్‌, జాయింట్‌ సెక్రటరీ దుర్గాప్రసాద్‌, ప్రణయ్‌, శ్రీ విష్ణు, అజయ్‌, మౌనికతోపాటు వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

నాణ్యమైన విద్య అందించాలి

పెద్దపల్లి : గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు మెరుగైన వసతులు కల్పించాలని ఎమ్మెల్సీ మల్క కొమురయ్య డిమాండ్‌ చేశారు. జిల్లా కేంద్రంలోని మహాత్మాజ్యోతిబా పూలే తెలంగాణ సంక్షేమ గురుకుల పాఠశాలను ఆదివారం ఆయన సందర్శించారు. విద్యాబోధన, పాఠ్యపుస్తకాలు, భోజన నాణ్యత, తాగునీరు, వసతి గదులు, పారిశుధ్యం తదితర అంశాలపై ప్రిన్సిపాల్‌, ఉపాధ్యాయులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థులతో కాసేపు మాట్లాడి సమస్యలపై ఆరా తీశారు. పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్య అందించడం ప్రభుత్వ బాధ్యతన్నారు.

ప్రజలు సహకరించాలి

గోదావరిఖని: ప్రజల సహకారంతో నేరాల నియంత్రణ సాధ్యమని గోదావరిఖని ఏసీపీ రమేశ్‌ అన్నారు. స్థానిక సప్తగిరికాలనీలో వన్‌టౌన్‌ సీఐ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి కమ్యూనిటీ పోలీసింగ్‌ నిర్వహించారు. 65 వాహనాలు, 6 ఆటోలను తనిఖీ చేసి ధ్రువీకరణ పత్రాలు పరిశీలించారు. పత్రాలు లేని 15 వాహనాలను ఠాణాకు తరలించారు. మొబైల్‌ ఫోన్లకు లాక్‌లు ఏర్పాటు చేయడం, ప్రత్యేక గదుల్లోకి వెళ్లి ఎక్కువగా మాట్లాడటం, రీల్స్‌ లేదా ఇతర ఆన్‌లైన్‌ కంటెంట్‌ను వీక్షించడం వంటి అంశాలను తల్లిదండ్రులు పర్యవేక్షించాలని సూచించారు. అనుమానాస్పద కార్యకలాపాలపై డయల్‌ 112కు సమాచారం ఇవ్వాలని కోరారు. ఎస్‌ఐలు మనోహర్‌, సంధ్యారాణి, రాజశేఖర్‌, అనూష, వెంకట్‌, హరీశేఖర్‌, ప్రసాద్‌, కార్పొరేటర్‌ గడ్డం శ్రీనివాస్‌, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement