పూలు చల్లారు.. నిరసన తెలిపారు | - | Sakshi
Sakshi News home page

పూలు చల్లారు.. నిరసన తెలిపారు

Jul 29 2026 12:22 AM | Updated on Jul 29 2026 12:22 AM

కోల్‌సిటీ: రామగుండం నగరం గంగానగర్‌ సమీప గోదావరి తీరంలోని హిందూ శ్మశానవాటికలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్‌తో స్వచ్ఛంద సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మంగళవారం పూలుచల్లి నిరసన తెలిపారు. శ్మశానవాటికను సందర్శించిన ప్రతినిధులు.. సదుపాయాలు లేక బంధువులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సంస్థ గౌరవాధ్యక్షుడు మద్దెల దినేశ్‌, అధ్యక్షుడు, మాజీ కార్పొరేటర్‌ అయిత శివకుమార్‌, ప్రధాన కార్యదర్శి దుర్గం నగేశ్‌, ఉపాధ్యక్షురాలు గోలివాడ చంద్రకళ మాట్లాడుతూ, మూడేళ్ల క్రితం నిలిపివేసిన రూపాయికే అంత్యక్రియల పథకాన్ని పునరుద్ధరించాలన్నారు. శ్మశానవాటిలో తాగునీరు, విద్యుత్‌, రహదారి, ప్రహరీ వంటి వసతులు లేవన్నారు. రాత్రివేళ అంత్యక్రియలు నిర్వహించే కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని పేర్కొన్నారు. సుమారు పదేళ్ల క్రితం రూ.40 లక్షలతో కొనుగోలు చేసిన గ్యాస్‌ ఆధారిత దహన యంత్రం వినియోగంలోకి రాకపోగా, దానికోసం రూ.60 లక్షలు వెచ్చించి నిర్మించిన షెడ్డు నిరుపయోగంగా మారిందని ఆరోపించారు. శ్మశానవాటిక నిర్వహణ బాధ్యతలను సింగరేణికి అప్పగించాలని ఎమ్మెల్యే, కలెక్టర్‌ను కోరారు. ఈ కార్యక్రమంలో మండల శ్రీనివాస్‌, కంది సుజాత, సరిత లక్ష్మి, రామ, సుశీల, కొండూ రమాదేవి, ప్రతాప్‌ పాల్గొన్నారు.

హిందూ శ్మశానవాటిలో అసౌకర్యాలపై ఆందోళన

స్వచ్ఛంద సంస్థ ప్రతినిధుల వినూత్న నిరసన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement