యైటింక్లయిన్‌కాలనీ: సింగరేణి ఆర్జీ–2 ఆధ్వర్యంలో సీఈఆర్ క్లబ్‌లో మంగళవారం ఫ్యామిలీ డే ఘ నంగా నిర్వహించారు. జీఎం వెంకటయ్య జ్యోతి ప్రజ్వులన చేసి వేడుకలు ప్రాంభించారు. క్రీడాపోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. జీఎం మాట్లాడుతూ, క్లబ్ అభివృద్ధికి అన్నివిధాలా సహకరిస్తామన్నారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఎస్‌వోటూ జీఎం రాముడు, సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం నాయకులు, క్లబ్ నిర్వాహకులు వేణుగోపాల్, సాంబశివరావు, సింగరేణి అధికారులు, కార్మిక కుటుంబాలు తదితరులు పాల్గొన్నారు.


