డ్రైవర్‌ సమయస్ఫూర్తితో తప్పిన ప్రమాదం | - | Sakshi
Sakshi News home page

డ్రైవర్‌ సమయస్ఫూర్తితో తప్పిన ప్రమాదం

Jul 29 2026 12:22 AM | Updated on Jul 29 2026 12:22 AM

● ఎన్టీపీసీ ఎఫ్‌సీఐ క్రాస్‌రోడ్డు వద్ద ఘటన

జ్యోతినగర్‌: ఎన్టీపీసీ ఎఫ్‌సీఐ క్రాస్‌రోడ్డు వద్ద లారీ బ్రేకులు ఫెయిల్‌ కావడంతో డ్రైవర్‌ ఆరిఫ్‌ సమయస్ఫూర్తితో వ్యవహరించి ప్రమాదాన్ని నివారించాడు. మంగళవారం రాత్రి మంచిర్యాల జిల్లా జైపూర్‌ పవర్‌ ప్లాంట్‌ నుంచి రిజక్ట్‌ కోల్‌ తీసుకొని గోదావరిఖని మీదుగా పెద్దపల్లి వైపు వెళ్తున్న క్రమంలో ఎన్టీపీసీ ఎఫ్‌సీఐ క్రాస్‌రోడ్డు వద్ద లారీ బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయి. అయితే, ముందు వెళ్తున్న కార్లను తప్పిస్తూ లారీని డ్రైవర్‌ డివైడర్‌పైకి తీసుకెళ్లడంతో పెను ప్రమాదం తప్పింది. డ్రైవర్‌ ఆరిఫ్‌ అప్రమత్తత, సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో పలువురి ప్రాణాలు కాపాడినట్లయింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. డ్రైవర్‌ను ఎస్సై ఉదయ్‌ కిరణ్‌ అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement