పాలకుర్తి: నేరాలను నియంత్రించడంతో సీసీ కెమెరాలు కీలకమని, ప్రతీగ్రామం వీటిని ఏ ర్పాటు చేసుకోవాలని పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి అన్నారు. జీడీనగర్ గ్రామంలో మంగళవారం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ప్రారంభ కా ర్యక్రమానికి డీసీపీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రధాన కూడళ్లు, పాఠశాలలు, దే వాలయాలు, ప్రధాన రహదారులపై తప్పని సరిగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవా లని సూచించారు. తద్వారా నేరాలను నియంత్రించడమే కాకుండా నేరస్తులను పట్టుకునేందుకు దోహదపడుతాయని అన్నారు. గోదావరిఖని ఏసీపీ రమేశ్, సర్పంచ్ సూర రమ, సీఐ కృష్ణకుమార్, ఎస్సై శ్రీధర్, మాజీ సర్పంచ్ సూర సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.
గురుపౌర్ణమికి ఏర్పాట్లు
ఫెర్టిలైజర్‌సిటీ: దాదాపు రెండుదశాబ్దాల క్రితం అందుబాటులోకి వచ్చిన గౌతమినగర్‌లోని షిర్డీసాయిబాబా ఆలయంలో బుధవారం గురుపౌర్ణమి నిర్వహించనున్నారు. ఇందుకోసం నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు.
సేవలకు సత్కారం
పెద్దపల్లిరూరల్: జిల్లా రైతులకు సాగు విధానంపై సూచనలిస్తూ, మెళకువలు పాటిస్తూ మంచి దిగుబడులు సాధించేలా ప్రోత్సహిస్తు న్న రైతు విజ్ఞాన కేంద్ర కో ఆర్డినేటర్, శాస్త్రవేత్త సంపత్‌ను మంగళవారం హైదరాబాద్‌లో జరి గిన రైతునేస్తం కార్యక్రమంలో సత్కరించారు. చీఫ్ సెక్రటరీ సంజయ్‌జాజు, డైరెక్టర్ గోపి తదితరులు సత్కరించగా, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు అభినందించారు.
వేగవంతంగా సర్ ప్రక్రియ
పెద్దపల్లి: రెవెన్యూ, భూ సమస్యల పరిష్కారం, ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియ వేగవంతంగా, పారదర్శకంగా పూర్తిచేయాలని అదనపు కలెక్టర్ శ్రీరాములు ఆదేశించారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయాన్ని ఆయన మంగళవారం తనిఖీ చేశారు. అనంతరం శాంతినగర్‌లో కొనసాగుతున్న సర్ ప్రక్రి య పరిశీలించి అధికారులకు కీలక సూచనలు చేశారు. తహసీల్దార్ రాజయ్య, అధికారులు, బీఎల్‌వోలు తదితరులు పాల్గొన్నారు.
మంథనిలోనే కొనసాగించండి
మంథని: వ్యవసాయ శాఖ కార్యాలయాన్ని సూరయ్యపల్లి గ్రామంలోని రైతు వేదికకు తరలించడం సరికాదని, తక్షణమే మంథనికి మా ర్చాలని వ్యవసాయ కార్మిక సంఘం నాయకు లు కోరారు. రెవెన్యూ డివిజనల్ అధికారి సురేశ్‌కు మంగళశారం వినతిపత్రాన్ని సమర్పించారు. అనంతరం వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బూడిద గణేశ్ మాట్లాడుతూ, మంథనిలోని కార్యాలయం శిథిలావస్థకు చేరిందనే కారణంతో సమీప గ్రామానికి మార్చడం సమంజసం కాదన్నారు. ఇప్పటికే కొన్ని ప్రభుత్వ కార్యాలయాలను జిల్లా కేంద్రానికి తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఇప్పుడు వ్యవసాయ శాఖ కార్యాలయాన్ని కూడా తరలించడం ద్వారా రైతులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తుందని ఆయన అన్నారు. ఈప్రయత్నాలను విరమించుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయక కార్యదర్శి ఏల్పుల సురేశ్, ఉపాధ్యక్షుడు బావు రవి, నాయకులు మంథని కిష్టస్వామి, ఉప్పు రమేశ్, ఇరుగురాల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


