కోల్‌సిటీ: గోదావరిఖని విఠల్‌నగ ర్‌లోని సింగరేణి పార్క్ పక్కన నె లల తరబడి పేరుకుపోయిన చెత్తకుప్పలను మంగళవారం బల్దియా సిబ్బంది తొలగించారు. ‘జ్వరాల విజృంభణ’ శీర్షికన 26న ‘సాక్షి’ ప్ర చురించిన కథనం చర్చనీయాంశమైంది. చెత్త తొలగించాల్సిన బాధ్యత సింగరేణిదే అయినా.. అధికారులు స్పందించలేదు. బల్దియా పారిశుధ్య సూపర్‌వైజర్ శ్రీనివాస్ సిబ్బందితో చెత తొలగించారు. బ్లీచింగ్ పౌడర్ చల్లించి పరిసరాలను శుభ్రం చేశా రు. సింగరేణి కార్మికుల నివాసాల సమీపంలో నెల ల తరబడి చెత్త పేరుకుపోయి కుళ్లిపోయినా అధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. ‘సాక్షి’ కథనంతో సమస్యకు పరిష్కారం లభించడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.


