మంథనిరూరల్: జూలై నెల చివరిదశలో ఉంది.. మరోమూడు రోజులైతే ఆగస్టు ప్రారంభమవుతుంది. సాధారణంగా చెరువులు, కుంటలు ఇప్పటికే అలుగు పడేవి. కానీ, ఈసారి ఎల్‌నినో ప్రభావంతో భారీవర్షాలు ఇంకా కురవడంలేదు. ఒక్క చెరువు మత్తడి కూడా పడలేదు. గతేఏడాది జూలై చివరి వారంలో కురిసిన వర్షాలతో చెరువులు నిండి అలుగు పారాయి. వరదలు సైతం ముంచేత్తాయి. ఈసారి అలాంటి పరిస్థితులు లేక వందల ఎకరాల ఆయకట్టు సాగుకు ప్రశ్నార్థకంగా మారింది.
రెండు నెలల్లో ఒక్క చెరువు నిండలే..
జిల్లావ్యాప్తంగా 1,086 చెరువులు ఉండగా ఈవర్షాకాల సీజన్‌ప్రారంభమై రెండు నెలలు గడుస్తోంది. ఇప్పటివరకు ఒక్క చెరువులోకి కూడా నీళ్లు చేరక అలుగు పడిన దాఖలాలు లేవు. అనేకచెరువుల్లో గతేడాది ఉన్న నీళ్లు మినహా కొత్త నీరు రాలేదని గ్రామస్తులు చెబుతున్నారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఉన్ననీళ్లు కూడా ఆవిరైపోతాయనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
ప్రశ్నార్థకంగా వందల ఎకరాల ఆయకట్టు..
జిల్లాలోని అనేక గ్రామాల్లో చెరువుల కింద భూ ముల సాగు ప్రశ్నార్థకంగా మారింది. ఎల్‌నినో ప్ర భావంతో వర్షాలు కురవక చెరువులోకి నీళ్లు రాలే దు. చెరువులు నిండితేనే ఆయకట్టు సాగు అవుతుంది. ఈ క్రమంలో రైతులు దుక్కిలు దున్నినార్లు పో సుకుని సిద్ధం చేసుకున్నారు. కాలం వెళ్లిపోతున్నా సరైన వర్షాలు పడకపోవడం చెరువులోకి నీళ్లు చేరకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
చేపల కోసం నీళ్లు వదిలి..
అనేకగ్రామాల్లోని చెరువుల్లో సొసైటీల ద్వారా చేప ల పెంపకం చేపట్టారు. జనవరి నుంచి ఏప్రిల్ వ రకు చేపలు పడుతుంటారు. యాసంగి సీజన్‌లో వరి కోతలు ముగియగానే చెరువుల్లోని నీటిని వది లి చేపలు పడుతుంటారు. ఈసారి కూడా ఎల్‌నినో ప్రభావం ఉందని తెలిసినా అనేక చెరువుల్లో నీటిని వృథాగా దిగువకు వదిలివేశారు. దీంతో గతేడాది నీళ్లు వెళ్లిపోయి కొత్తనీరు రాక జిల్లావ్యాప్తంగా అనేక చెరువులు వెలవెలబోతున్నాయి.
గతంలో కాలువల ద్వారా..
గతంలో అనేక చెరువులను ఎస్సారెస్పీ కాలువనీళ్ల ద్వారా నింపేవారు. గోదావరి నదిలో నీళ్లు ఉండటం, ఎస్సారెస్పీ కాలువల ద్వారా నీటిని విడుదల చేయడంతో ఆ నీటిని చెరువులకు మళ్లించి నింపేవారు. వర్షాలు కురవకుపోయినా చెరువులు నిండు గా ఉండేవి. ఈసారి గోదావరిలో సైతం నీళ్లు లేక, వర్షాలు కురవక సాగుపై ప్రభావం పడుతోంది.
నిండని చెరువులు.. సాగుకు నోచుకోని ఆయకట్టు
దుక్కులు దున్ని నాటుకు సిద్ధం చేసుకున్న అన్నదాత
వానాకాలం సీజన్ సాగుపై ఎల్‌నినో తీవ్ర ప్రభావం


