నైపుణ్యాభివృద్ధికి ప్రత్యేక యాప్‌ | - | Sakshi
Sakshi News home page

నైపుణ్యాభివృద్ధికి ప్రత్యేక యాప్‌

Jul 29 2026 12:22 AM | Updated on Jul 29 2026 12:22 AM

● ఈ–బుక్స్‌: నేషనల్‌ ఇన్‌స్ట్రక్షనల్‌ మీడియా ఇనిస్టిట్యూట్‌(ఎన్‌ఐఎంఐ) రూపొందించిన అన్నిట్రేడ్‌ల సబ్జెక్టు డిజిటల్‌ పుస్తకాలు ఇందులో అందుబాటులో ఉంటాయి. ఏ సమయంలోనైనా అంశాలను యాప్‌ ఓపెన్‌ చేసి పరిశీలించుకునే అవకాశం ఉంటుంది. ● ప్రశ్నల నిధి: ఏటా వార్షిక పరీక్షలకు ప్రిపేర్‌ అయ్యేందుకు గత పరీక్షల ప్రశ్నపత్రాలను, ఇతరత్రా ముఖ్యప్రశ్నల అంశాలు అందు బాటులో ఉంటాయి. ప్రిపరేషన్‌ విద్యార్థులకు సులువుగా ఉంటుంది. ● వీడియో లెర్నింగ్‌: ఇదే యాప్‌లో క్లిష్టమైన కంటెంట్‌ను ప్రయోగాత్మకంగా వీక్షించేందుకు వీడియో పాఠాలను కూడా పరిశీలించుకునే అవకాశం ఉంటుంది. ఫలితంగా ప్రతీ విద్యార్థికి సులువుగా అర్థమయ్యే రీతిలో విద్యాబోధన ఉండడంతో పరీక్షల ప్రిపరేషన్‌ సులువవుతుంది. ఇందులో లభించే కోర్సు మెటీరియల్‌ నేషనల్‌ స్కిల్స్‌ క్వాలిఫికేషన్‌ ఫ్రేమ్‌వర్క్‌ (ఎన్‌ఎస్‌క్యూఎఫ్‌) ప్రమాణాల ప్రకారం ఉంటుంది. ● క్రాఫ్ట్‌మెన్‌ ట్రైనింగ్‌ స్కీం (సీటీఎస్‌): ఐటీఐ లోని ఎలక్ట్రిషీయన్‌, ఫిట్టర్‌, వెల్డర్‌, కోపా వంటి ట్రేడ్ల సమాచారం పరిశీలించుకునే అవకాశం ఈ యాప్‌లో ఉంటుంది. ఎన్‌ఐఎంఐ పుస్తకాలపై ముద్రించిన క్యూఆర్‌ కోడ్‌లను స్కాన్‌ చేసి నేరుగా డిజిటల్‌ కంటెంట్‌ చూసే వీలుంటుంది. ఇందులో ఆన్‌లైన్‌ పరీక్షల సాధన కోసం మాక్‌టెస్ట్‌ యాప్‌ లింక్‌ కూడా ఇందులోనే ఉంటుంది.

రామగుండం: ఇండస్ట్రియల్‌ ట్రైనింగ్‌ ఇనిస్టిట్యూట్‌(ఐటీఐ), నేషనల్‌ స్కిల్స్‌ ట్రైనింగ్‌ ఇనిస్టిట్యూట్‌ (ఎన్‌ఎస్‌టీఐ) విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధి పెంపొందించేందుకు భారత ప్రభుత్వం నైపుణ్యాభివృద్ధి, ఉద్యోగ మంత్రిత్వశాఖ(ఎంఎస్‌డీఈ), డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ ట్రైనింగ్‌ ద్వారా భారత్‌ స్కిల్స్‌ పేరిట ప్రత్యేక యాప్‌ రూపొందించింది. ఇందు లోని కంటెంట్‌ను మొబైల్‌ ద్వారా సులభంగా యా క్సెస్‌ చేసుకునే అవకాశం ఉంటుంది. ఫలితంగా విద్యార్థులకు ఇదదిఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. యాప్‌ ప్రధాన ఫీచర్లు..

ఎలా డౌన్‌లోడ్‌ చేసుకోవాలంటే..

ఆండ్రాయిడ్‌ మొబైల్‌లోని గూగుల్‌ ప్లే స్టోర్‌లో భారత్‌ స్కిల్స్‌ అని టైప్‌ చేసి డెవలపర్‌ పేరు, నేషనల్‌ ఇన్‌స్ట్రక్షనల్‌ మీడియా ఇనిస్టిట్యూట్‌ (ఎన్‌ఐఎంఐ) ఉందో పరిశీలించి ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. నైపుణ్యాభివృద్ధి కోసం జిల్లాయువత ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని జిల్లాస్థాయి ఉన్నతాధికారులు కోరుతున్నారు.

అందుబాటులోకి ‘భారత్‌ స్కిల్స్‌’

ఐటీఐ, ఎన్‌ఎస్‌టీఐ విద్యార్థులకు మేలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement