సంప్రదాయానికి చిహ్నం | - | Sakshi
Sakshi News home page

సంప్రదాయానికి చిహ్నం

Jul 29 2026 12:22 AM | Updated on Jul 29 2026 12:22 AM

ఆషాడ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం పూర్వీకుల నుంచి వస్తోంది. ఇది తెలుగువారి సంస్కృతి, సంప్రదాయాలకు నిలువుటద్దం. ఆషాఢమాసంలో ప్రకృతి సిద్ధంగా లభించే గోరింటాకే బాగుంటుంది.

– పల్లా అపర్ణ

చేతికి అందం

గోరింటాకు పెట్టుకోవడమంటే నాకు చిన్నతనం నుంచే ఆసక్తి. ఈనెలలో త ప్పనిసరిగా గోరింటాకు పెట్టుకుంటాం. పోటీపడి మరీ ఎర్రగా పండేవరకూ వేచిచూస్తాం. గోరింటాకు చేతికి అందం, ఆరోగ్యం. – కొమురవెల్లి లక్ష్మి

చర్మవాధులు దూరం

వర్షాకాలంలో నీటిలో తడిస్తే కాళ్లు, చేతులకు వచ్చే చర్మవ్యాధుల నియంత్రణకు గోరింటాకు యాంటీబయాటిక్‌గా పనిచేస్తుంది. గోరింటాకుతో గోళ్లకు అందం వస్తుంది. గోళ్లకు వ్యాధులు రాకుండా గోరింటాకు కాపాడుతుంది. – బిరుదు సమత

ఏటా సంబురాలు

ఆషాడమాసం రావడంతోనే మా స్నేహితులు అందరం కలిసి ఒకచోట చేరుతాం. గోరింటాకు రుబ్బుకుని చేతులకు పెట్టుకుంటాం. సుమారు ఆరేళ్లుగా ఏటా ఇలా సంబురాలు ఘనంగా జరుపుకుంటున్నాం.

– మల్యాల శైలజ

సంబురాల్లో మహిళలు

మైదాకు నూరుతున్న మహిళలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement