● ఎల్‌నినో ప్రభావం ఎదుర్కొనేందుకు మంచిమార్గాలు ● రైతులకు అవగాహన కల్పిస్తున్న రామగిరి వ్యవసాయ శాస్త్రవ్తేతలు | - | Sakshi
Sakshi News home page

● ఎల్‌నినో ప్రభావం ఎదుర్కొనేందుకు మంచిమార్గాలు ● రైతులకు అవగాహన కల్పిస్తున్న రామగిరి వ్యవసాయ శాస్త్రవ్తేతలు

Jul 27 2026 2:18 AM | Updated on Jul 27 2026 2:18 AM

● ఎల్‌నినో ప్రభావం ఎదుర్కొనేందుకు మంచిమార్గాలు ● రైతులకు అవగాహన కల్పిస్తున్న రామగిరి వ్యవసాయ శాస్త్రవ్తేతలు ● నేల సారం ఆధారంగానే ఎరువులు వేయాలి ● పీల్చే పురుగులపై నిఘా ● కలుపు మొక్కల నియంత్రణ కీలకం ‘యాజమాన్యం’.. అప్రమత్తం

పూత, కాయలు రాలకుండా..

వర్షం కురవకుంటే..

రామగిరి: ఈసారి ఎల్‌నినో ప్రభావం ఉంది. వర్షాలు ఆలస్యంగా కురుస్తాయని, దీర్ఘకాలిక పొడి విరామం, అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఈక్రమంలో పత్తిలో తేమకొరత, పూతరాలడం, కాయలు ఊడిపోవడం, రసంపీల్చే పురుగుల ఉధృతి పెరగడం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. శాసీ్త్రయ యాజమాన్య పద్ధతులు అనుసరిస్తే దిగుబడి నష్టాన్ని తగ్గించుకోవచ్చని రామగిరి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త కిరణ్‌ పిల్లి సూచిస్తున్నారు. ఆయన సూచనలు..

నీటిచుక్కను పొలంలోనే నిల్వ చేయండి

ఎల్‌నినోను అధికగమించేందుకు నీటి సంరక్షణే ముఖ్యమైన వ్యవసాయ చర్య. వర్షం కురిశాక వరుసల మధ్య అంతర కృషి చేసి నేలపై మట్టిపొర(డస్ట్‌మల్చ్‌) ఏర్పడేలా చేయాలి. దీంతో నేలలో తేమ ఆ విరి కాదు. ఎక్కువకాలం నిల్వ ఉంటుంది. పొలం చుట్టూ బలమైన కట్టలు వేయడం, బోదెలు ఏర్పా టు చేయడం అవసరం. పంట అవశేషాలు, వరిగడ్డి లేదా సేంద్రియ మల్చింగ్‌ ఉపయోగిస్తే నేల ఉష్ణోగ్రత 2–4 డిగ్రీల సెల్సియస్‌ వరకు తగ్గి తేమఎక్కువకాలం నిల్వ ఉంటుంది. మొక్కల ఎదుగుదల మెరుగుపడుతుంది. నీటిఅవసరం తగ్గుతుంది.

పొడివాతావరణంలో ఎక్కువ మోతాదులో యూరియా వేస్తే మొక్కలకు ఉపయోగం తక్కువగా ఉంటంది. ఎరువుల నష్టం అధికంగా ఉంటుంది. భూసారం పరీక్ష ఫలితాల ఆధారంగానే ఎరువులు వేయాలి. నత్రజనిని విడతల వారీగా వేయాలి. తేమ లేనిసమయంలో యూరియా వేయొద్దు. వర్షం కురిసిన తర్వాత లేదా రక్షణాత్మక నీటిపారుదల తర్వాతే నత్రజని వేయాలి. సింగిల్‌సూపర్‌ ఫాస్ఫేట్‌ వాడితే భాస్వరంతోపాటు గంధకం, కాల్షియం కూడా లభించి పంట ఎదుగుదల మెరుగుపడుతుంది. కంపోస్ట్‌, వర్మీకంపోస్ట్‌, పశువుల ఎరువు వంటి సేంద్రియ పదార్థాలు వినిగిస్తే నేలలో సేంద్రియ కార్బన్‌ పెరిగి నీటినిల్వ సామర్థ్యం మెరుగవుతుంది.

ఎల్‌నినో పరిస్థితుల్లో అధిక ఉష్ణోగ్రతలు, తక్కువ గాలి, తేమతో తెల్లదోమ, నల్ల తమర పురుగు, పచ్చదోమ, ఎర్రసాలీడు వంటి పీల్చేపురుగుల ఉధృతి పెరిగే అవకాశం ఉంది. రైతులు వారానికి కనీసం రెండుసార్లు పొలాన్ని పరిశీలించాలి. ఎకరాకు 8–10 పసుపు జిగురు అట్టలు ఏర్పాటు చేయాలి. ఆర్థిక నష్టం స్థాయికి చేరిన తర్వాతే శాస్త్రవేత్తల సూచన మేరకు పురుగుమందు పిచికారీ చేయాలి. రసాయనాలను మారుస్తూ వాడితే నిరోధకత సమస్య తగ్గుతుంది.

కలుపు మొక్కలు పత్తితోపాటు నేలలోని తేమ, పోషకాలను వినియోగిస్తాయి. విత్తిన 20–25 రోజుల్లోపు తొలి అంతరకృషి, 40–45 రోజుల్లోపు రెండోఅంతరకృషి పూర్తిచేయాలి.

అధిక ఉష్ణోగ్రతలు, తేమకొరతతో పత్తిలో పూత, చిన్న కాయలు రాలిపోవడం సాధారణంగా కనిపిస్తుంది. ఈ పరిస్థితుల్లో అనవసరంగా అధిక నత్రజని వేయకుండా, తగిన తేమ లభించినప్పుడే వేయాలి. అవసరమైతే శాస్త్రవేత్తల సిఫార్సు మేరకే ఫోలియర్‌ పోషక ద్రావణాలు పిచికారీ చేయాలి. నీటి ఒత్తిడిని తగ్గించే చర్యలకు ప్రాధాన్యం ఇవ్వాలి.

10–15 రోజుల పాటు వర్షం కురవకుంటే.. అందుబాటులో ఉన్ననీటితో రక్షణాత్మక నీటిపారుదల ఇవ్వాలి. బిందు సేద్యం ద్వారా 30–40 శాతం వరకు నీటిని ఆదా చేయవచ్చు. ఒకేసారి ఎక్కువ నీరు ఇవ్వకుండా అవసరానికి అనుగుణంగానే అందించాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement