పెట్రోల్‌ పోస్తుండగా ఢీకొట్టిన కారు | - | Sakshi
Sakshi News home page

పెట్రోల్‌ పోస్తుండగా ఢీకొట్టిన కారు

Jul 27 2026 2:18 AM | Updated on Jul 27 2026 2:18 AM

● వెంకట్రావుపల్లి ఉపసర్పంచ్‌ మృతి ● మరోముగ్గురికి గాయాలు

పెద్దపల్లిరూరల్‌/జూలపల్లి:పెద్దపల్లి నుంచి వెంకట్రావుపల్లికి వెళ్తుండగా.. మార్గమధ్యంలో బైక్‌లో పెట్రోల్‌ అయిపోవడమే ఉప సర్పంచ్‌ రవికి ప్రాణగండంగా మారింది. మరోబైక్‌పై సమీపంలోని బంక్‌ నుంచి బాటిల్‌లో తెచ్చిన పెట్రోల్‌ను పోస్తుండగా పెద్దపల్లి వైపు(ఎదురుగా) వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పెద్దపల్లి జిల్లాలోని జూలపల్లి మండలం వెంకట్రావుపల్లి ఉపసర్పంచ్‌ పర్లపల్లి రవి (48) అక్కడికక్కడే మరణించాడు. పెద్దపల్లి మండలం నిట్టూరు గ్రామశివారులో ఆదివారం రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో మరోముగ్గురికి గాయాల య్యాయి. ప్రమాదం జరిగిందనే సమాచారం అందుకున్న పెద్దపల్లిరూరల్‌ ఎస్సై మధుకర్‌, జూలపల్లి ఎస్సై మల్లేశ్‌ వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. ఉపసర్పంచ్‌ రవి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పెద్దపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదంలో గాయపడ్డ వేల్పుల సందీప్‌, కటికరెడ్డి నర్సయ్య, దాడి రాజయ్యకు అవసరమైన వైద్యసేవలందించారు. పెద్దపల్లి రూరల్‌ ఎస్సై కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement