మల్లాపూర్: పాముకాటుతో రైతు మృతిచెందిన ఘటన మండలంలోని రత్నాపూర్‌లో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన యనం మల్ల య్య (62) ఈనెల 25న మధ్యాహ్నం తన మొక్కజొన్న చేనులోకి వెళ్లాడు. అక్కడ విషపాము కాలుపై కాటేసింది. వెంటనే ఇంటికి చేరిన ఆయనను కుటుంబ సభ్యులు మెట్‌పల్లిలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. మల్లయ్య కుమారుడు మనీష్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అనిల్ తెలిపారు.
పేకాట శిబిరంపై దాడి
చిగురుమామిడి: చిగురుమామిడి మండలం రేకొండ గ్రామంలో పేకాట శిబిరంపై ఎస్సై జగదీశ్వర్ దాడిచేశారు. పేకాట ఆడుతున్న 12మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.26వేల నగదు, 11స్మార్ట్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.


