ముగిసిన సీబీఎస్‌ఈ ఖోఖో పోటీలు | - | Sakshi
Sakshi News home page

ముగిసిన సీబీఎస్‌ఈ ఖోఖో పోటీలు

Jul 27 2026 2:18 AM | Updated on Jul 27 2026 2:18 AM

కరీంనగర్‌స్పోర్ట్స్‌: కరీంనగర్‌ వేదికగా మూడు రోజులు జరిగిన సీబీఎస్‌ఈ క్లస్టర్‌–7 ఖోఖో బాలికల టోర్నీ ఆదివారం ఘనంగా ముగిసింది. కరీంనగర్‌ కొత్తపల్లిలోని అల్పోర్స్‌ ఈ–టెక్నో స్కూల్‌ ఆతిథ్యంలో జరిగిన ఈ క్రీడా సమరంలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ నుంచి అండర్‌ 14,,17,19 విభాగంలో 104 జట్లు పోటీపడ్డాయి. హోరాహోరీగా సాగిన ఫైనల్‌లో అండర్‌–19 విభాగంలో శ్రీ ప్రకాశ్‌ విద్యానికేతన్‌, అండర్‌–17లో మాంటిస్సోరి ఎలైట్‌ స్కూల్‌, అండర్‌–14లో ఏకశిల హైస్కూల్‌ జట్లు విజేతలుగా నిలిచాయి. విజేత జట్లకు అల్ఫోర్స్‌ విద్యాసంస్థల అధినేత వి.నరేందర్‌రెడ్డి ట్రోపీలు, మెడల్స్‌ ప్రదానం చేశారు. సీబీఎస్‌ఈ పరిశీలకుడు ఎం.భరత్‌ కుమార్‌, తెలంగాణ ఖోఖో సంఘం రెఫరీ బోర్డు కన్వీనర్‌ వంగపల్లి సూర్య ప్రకాశ్‌, భారత మహిళా ఖోఖో జట్టు కోచ్‌ కె.నరేశ్‌, అంతర్జాతీయ రెఫరీ ఎ.రవీందర్‌, షఫీ, ఎస్కె.మొయినోద్దీన్‌, వేల్పుల సురేందర్‌ పాల్గొన్నారు.

విజేతలు వీరే

అండర్‌–14లో ప్రథమ స్థానంలో ఏకశిల హైస్కూల్‌, వర్ధన్నపేట, ద్వితీయ స్థానంలో ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌, నాచారం, మల్కాజ్‌గిరి,, తృతీయ స్థానంలో ఎస్‌ఆర్‌ విద్యానికేతన్‌, గద్వాల్‌, నాలుగో స్థానంలో అక్షర వాగ్దేవి స్కూల్‌, సికింద్రాబాద్‌ నిలిచాయి. అండర్‌–17లో ప్రథమ స్థానంలో మాంటిస్సోరి ఎలైట్‌ స్కూల్‌, రాఫాడు, అనంతపూర్‌, ద్వితీయస్థానంలో సూర్య అకాడమీ, బాచుపల్లి, తృతీయస్థానంలో బీవీ భువన్‌ రెసిడెన్సీ, తాడేపల్లిగూడెం, నాలుగోస్థానంలో పల్లవి స్కూల్‌, బండ్లగూడ నిలిచాయి. అండర్‌–19 ప్రథమ స్థానంలో శ్రీ ప్రకాశ్‌ విద్యానికేతన్‌, పాయాకరావ్‌పేట, అనకాపల్లి, ద్వితీయస్థానంలో పల్లవి స్కూల్‌ అల్వాల్‌, హైదరాబాద్‌, తృతీయస్థానంలో అక్షర విద్యాలయ, నెల్లూరు, నాలుగోస్థానంలో ది హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌, హన్మకొండ నిలిచాయి.

చాంపియన్లుగా ఏకశిల, మాంటిస్సోరి, శ్రీ ప్రకాశ్‌ స్కూళ్లు

ట్రోఫీలు ప్రదానం చేసిన అల్ఫోర్స్‌ విద్యాసంస్థల అధినేత నరేందర్‌ రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement