వేములవాడ: వేములవాడ రాజన్న ఆలయ అనుబంధం భీమేశ్వరాలయంలో విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర బృందం సభ్యులు ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామివారిని దర్శించుకున్నారు. కోడెదూడల సమర్పణను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వీహెచ్‌పీ రాష్ట్ర ధర్మాచార్య సంపర్క ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి మాట్లాడుతూ సనాతన సంప్రదాయంలో గోవుకు విశిష్ట స్థానం ఉందని, వాటి సంరక్షణ సమాజానికి అత్యంత అవసరమని వివరించారు. రాజన్నకు కోడెదూడల సమర్పణకు శతాబ్దాల చరిత్ర ఉందన్నారు. యువత ఈ పవిత్ర సేవకు ముందుకు రావాలని కోరారు. వీహెచ్‌పీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సునీతరెడ్డి, కార్యాలయం కార్యదర్శి జగదీశ్వర్‌జి, మాతృశక్తి రాష్ట్ర కో–కన్వీనర్ శ్రీవాణి, దుర్గా వాహిని రాష్ట్ర కన్వీనర్ వాణి సక్కుబాయి, దుర్గావాహిని మహానగర కన్వీనర్ మాధవి, రాజు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర ధర్మాచార్య సంపర్క ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి


