అశ్రునయనాల మధ్య అఖిల్‌రెడ్డి అంత్యక్రియలు | - | Sakshi
Sakshi News home page

అశ్రునయనాల మధ్య అఖిల్‌రెడ్డి అంత్యక్రియలు

Jul 27 2026 2:18 AM | Updated on Jul 27 2026 2:18 AM

● హాజరైన స్థానికులు, గ్రామస్తులు

కాల్వశ్రీరాంపూర్‌: ఉన్నత వి ద్యాభ్యాసానికి స్పెయిన్‌ దేశం వెళ్లిన పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్‌ మండలం కూనారం గ్రామానికి చెందిన గీట్ల అఖిల్‌ రెడ్డి(30) అంత్యక్రియలు హైద రాబాద్‌లో ఆదివారం అశ్రునయనాల మధ్య నిర్వహించారు. ఆదేశంలోని తాను నివాసం ఉంటున్న భవనం పైనుంచిపడి గతనెల 27న అఖిల్‌రెడ్డి మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన తల్లిదండ్రులు గీట్ల సుభాషిణిరెడ్డి – గుణాకర్‌రెడ్డి హైదరాబాద్‌ బొల్లారంలో నివాసం ఉంటున్నారు. సుగుణాకర్‌రెడ్డి స్వగ్రామంలో వ్యవసాయ పనులు చూస్తూ హైదరాబాద్‌ వెళ్లి వస్తుండేవారు. కుమారుడి ఉన్నత చదువుల కోసం స్టడీలోన్‌ తీసు కుని హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు కోసం ఈ ఏడా ది జనవరి 24న స్పెయిన్‌ పంపించారు. ఆర్నెళ్లలో నే ఘటన చోటుచేసుకోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. కాల్వశ్రీరాంపూర్‌ మాజీ ఎంపీ పీ సారయ్యగౌడ్‌, మాజీ ఎమ్మెల్యే తనయుడు గీట్ల రాజేందర్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌ డొంకెన మొగిలి, మాజీ ఎంపీటీసీ సాధనవేన కొమురయ్య, తదితరులు అంత్యక్రియలకు హాజరయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement