కోల్‌సిటీ: నగరంలో చేపట్టే పరిశుభ్రత పనుల్లో ప్ర తీపౌరుడు భాగస్వామి కావాలని మేయర్ మహంకాళి స్వామి కోరారు. 10వ డివిజన్ రాంనగర్‌లో శనివారం మేయర్ వార్డుబాట చేపట్టారు. 2ఏ ఇంక్లయిన్ మోరీ వద్ద కాలువ పూడిక తొలగింపు, ఖాళీ స్థలాల్లో పిచ్చిమొక్కల తొలగింపు పనులు పరిశీలించారు. కమిషనర్ అరుణశ్రీ మాట్లాడారు. అలాగే 2, 32, 33, 34, 49వ డివిజన్లలో పర్యటించిన మేయర్.. రోడ్లు, కాలువలపై ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలను తొలగించాలన్నారు. కార్పొరేటర్లు అడ్డాల గట్టయ్య, వెంగళ బాపు, తోట మమత, మెరుగు భూలక్ష్మి, స్వప్నప్రియ, నాయకులు పాల్గొన్నారు.


