పెద్దపల్లిరూరల్: ఉచిత న్యాయసేవలను ది వ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల సూచించారు. జిల్లా కోర్టులో న్యాయ సేవాధికార సంస్థ జిల్లా ప్రధాన కార్యదర్శి వంగర భవాని, సీనియర్ కన్సల్టెంట్ దేవకుమార్‌తో కలిసి శనివారం జడ్జి పోస్టర్ ఆవిష్కరించి మా ట్లాడారు. పబ్లిక్ రిడ్రెస్సల్ అసియేటెడ్ నెట్‌వర్క్స్, న్యాయ సేవాధికార సంస్థ సంయుక్తంగా ఈ ప్రాజెక్టు చేపట్టాయన్నారు. దివ్యాంగులు, మహిళలు, చిన్నారుల హక్కులను కాపాడడం, సంక్షేమం కోసమే పనిచేస్తున్నట్లు తెలిపారు. న్యాయ సాయం కోసం టోల్‌ఫ్రీ నంబరు 15100 లేదా 95550 627483 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
భూగర్భ జలాల వృద్ధి లక్ష్యం
పెద్దపల్లిరూరల్: వర్షపునీటిని వృథా చేయకుండా ఇంకుడుగుంతల ద్వారా ఒడిసి పట్టుకుని భూగర్భజలాలను వృద్ధి చేసుకుందామని డీఆర్డీవో కాళిందిని అన్నారు. రాఘవాపూర్‌లో శనివారం సర్పంచ్ తాడిచెట్టి చామంతితో కలిసి ఇంకుడుగుంతలు, పల్లెప్రకృతివనంలో నర్సరీ, పాంపాండ్ పరిశీలించి సూచనలిచ్చారు. మొ క్కలను కాపాడి రోడ్ల వెంట, ఖాళీ స్థలాల్లో నాటించాలని తెలిపారు. ఏపీవో రమేశ్‌బాబు, టీఏ వెంకటేశ్, పంచాయతీ కార్యదర్శి భానుప్రసాద్, ఫీల్డ్ అసిస్టెంట్ సంపత్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం సబ్బితంలోని ఫారెస్ట్ నర్సరీని సర్పంచ్ సరోజన, కార్యదర్శి అఫ్జల్‌పాషా, ఎఫ్‌ఏ రమేశ్‌తో కలిసి పరిశీలించారు.
సీపీఎస్ విధానం వద్దు
పెద్దపల్లి: సీపీఎస్ విధానం రద్దు చేసి పాత పింఛన్ విధానం పునరుద్ధరించాలని, ఉద్యోగుల పెండింగ్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అ సోసియేషన్ జిల్లా శాఖ కోరింది. జిల్లా తొలి కా ర్యవర్గ సమావేశం స్థానిక ఐఎంఏ హాల్‌లో జి ల్లా అధ్యక్షుడు బొంకూరి శంకర్ అధ్యక్షతన శనివారం నిర్వహించారు. శంకర్ మాట్లాడుతూ, ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమాద బీమా, ఈహెచ్‌ఎస్ వంటి సంక్షేమ చర్యలు అమలు చేయడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. ప్రతినిధులు అయిరెడ్డి సందీప్‌రెడ్డి, అనితరెడ్డి, కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.
అధికారికంగా ఏకలవ్య జయంతి
పెద్దపల్లి: ఏకలవ్య జయంతిని అధికారికంగా నిర్వహించలని తెలంగాణ ఎరుకల ప్రజాసమితి నేతలు డిమాండ్ చేశారు. ఏకలవ్యుని జయంతిని జిల్లా కేంద్రంలో శనివారం ఘనంగా నిర్వహించారు. తమ సామాజికవర్గం అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరారు. తెలంగాణ ఎరుకల ప్రజా సమితి జిల్లా అధ్యక్షుడు మానుపాటి రవి, రాష్ట్ర ఉపాధ్యక్షులు మానుపాటి శ్రీను, రెవెల్లి తిరుపతి, జిల్లా ఉపాధ్యక్షులు అల్లెపు సదాశివ, రెవెల్లి శీనయ్య, లోకిని సమ్మయ్య, కార్యకర్తలు సంపత్, శ్రీకాంత్, కల్యాణ్, ప్రభాకర్, శివాజీ, శ్రీనాథ్, అంజి, సాయివర్ధన్ కుమార్ తదిరతులు పాల్గొన్నారు.
రేపు రక్షణ వార్షికోత్సవాలు
గోదావరిఖని: సింగరేణి సంస్థ 56వ రక్షణ వార్షికోత్సవాలను ఈనెల 27న ఎన్టీపీసీలోని శ్రీమ యి ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించనుంది. డీజీఎంఎస్ ఉజ్వల్‌తాహ్, సింగరేణి సీఎండీ బుద్ధ ప్రకాశ్ జ్యోతి ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. సింగరేణి డైరెక్టర్లు ఎల్‌వీ సూర్యనారాయణ, కె.వెంకటేశ్వర్లు, గౌతం పొట్రూ, తిరుమల్‌రావు, ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ఐఎన్‌టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్‌ప్రసాద్, సింగరేణి అధికారుల సంఘం అధ్యక్షుడు లక్ష్మీపతిగౌడ్ హాజరుకానున్నారు. సింగరేణివ్యాప్తంగా ఇటీవల నిర్వహించిన రక్షణ వార్షికోత్సవాల్లో ప్రతిభ కనబర్చిన గనులు, ఓసీపీలు, డిపార్ట్‌మెంట్‌లకు ఈ సందర్భంగా సీఎండీ బహుమతులు అందజేయనున్నారు.


