పెద్దపల్లిరూరల్: ఎట్టకేలకు జిల్లా కేంద్రంలో మె యిన్ రోడ్డు విస్తరణ శనివారం ప్రారంభమైంది. తొలిఏకాదశి పండుగ సందర్భంగా పనులకు శ్రీకా రం చుట్టడంతో ఇరుకురోడ్డు ఇబ్బందులు తీరుతా యని పట్టణవాసుల్లో ఆశాభావం వ్యక్తమవుతోంది. జిల్లా కేంద్రంగా మారిన పెద్దపల్లిని ఆ హోదాకు త గ్గట్టుగా అభివృద్ధి చేసుకునేలా సహకరించాలని ప్రభుత్వ విప్ విజయరమణారావు, మున్సిపల్ చైర్మన్ మల్లయ్య, కమిషనర్ వెంకటేశ్ కోరారు.
అభివృద్ధికి సహకరించాలి
మెయిన్ రోడ్డును తొలుత 66 అడుగుల వరకు విస్తరించాలని నిర్ణయించగా వ్యాపారుల నుంచి విముఖత వ్యక్తమైంది. 50 అడుగుల వరకు విస్తరించేందుకు సహకరిస్తామని వారు సంకేతాలిచ్చారు. అంతేకాదు.. విప్‌ను కలిసి ఎక్కువ నష్టం కలుగకుండా సహకరించాలని అభ్యర్థించారు. ఇటీవల ఆయన సమక్షంలో సమావేశమై మెయిన్ రోడ్డు 55 అడుగులు ఉండేలా విస్తరించేందుకు అంగీకరించారు. భవిష్యత్‌లోనూ వ్యాపారులు సహకరించేలా చూడాలని చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కమల్ కిశోర్ శారడకు పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్ మల్లయ్య, కమిషనర్ వెంకటేశ్ తదితరులు సూచించారు. వ్యాపారులు స్వచ్ఛందంగా కట్టడాలను తొలగించుకుంటామని సంసిద్ధత వ్యక్తం చేశారని కమిషనర్ వెంకటేశ్ వివరించారు.
జెండా చౌరస్తా నుంచే ప్రారంభం
మెయిన్ రోడ్డును 55 అడుగుల వరకు విస్తరించేలా నిర్ణయించిన మున్సిపల్ అధికారులు.. ఆ మేరకు ఇరువైపులా భవనాలకు మా ర్కింగ్ ఇచ్చారు. 15 రోజుల్లోగా తొలగించుకు ని అభివృద్ధికి సహకరించాలని కోరారు. జెండా చౌరస్తాలోని మున్సిపల్ షాపింగ్ కాంప్లె క్స్ గదిని తొలుత కూల్చివేశారు. అదే ప్రాంతంలోని ప్రధాన పోస్టాఫీసు, బీఎస్‌ఎన్‌ఎల్ ప్రహరీలను సైతం తొలగించారు. కొందరు యజమానులు కట్టడాలను స్వచ్ఛందంగా తొలగించుకునేందుకు సిద్ధమవుతున్నారు.


