గురుకులంలో ఏం జరుగుతోంది? | - | Sakshi
Sakshi News home page

గురుకులంలో ఏం జరుగుతోంది?

Jul 26 2026 7:42 AM | Updated on Jul 26 2026 7:42 AM

● డెటాల్‌ తాగి విద్యార్థుల అస్వస్థత ● రెండు రోజుల వ్యవధిలో నలుగురు ● చదువుపై ఒత్తిడా? మానసిక ఆందోళనలా?

మంథని: పెద్దపల్లి జిల్లా మంథని సాంఘిక సంక్షేమ బాలుర పాఠశాల/కళాశాలలో ఏం జరుగుతోందనే ఆందోళన తల్లిదండ్రుల్లో వ్యక్తమవుతోంది. వరుసగా రెండు రోజుల వ్యవధిలో నలుగురు విద్యార్థులు డెటాల్‌ తాగి అస్వస్థతకు గురికావడం తీవ్ర ఆందోళనకు దారితీసింది. విద్యార్థుల భద్రత, హాస్టల్‌ నిర్వహణ, సౌకర్యాలపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

రెండు రోజుల్లో నలుగురు..

గురుకులంలో ఐదు నుంచి ఇంటర్మీడియట్‌ వరకు సుమారు 540 మంది చదువుతున్నారు. ఇంతపెద్ద సంఖ్యలో విద్యార్థులుండే హాస్టల్‌లో రెండురోజులుగా విడతల వారీగా ఆరోతరగతిలోని నలుగురు విద్యార్థులు డెటాల్‌ తాగి అస్వస్థతకు గురవడం గ మనార్హం. గురువారం డెటాల్‌ తగిన ఇద్దరికి స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందించగా.. క్షేమంగా ఉన్నారు. శనివారం సైతం మరోఇద్దరు డెటాల్‌ తాగడంతో వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉన్నా.. ఈఘటన వెనుక ఉన్న అసలు కారణాలు తెలియరాలేదు.

ఎందుకు డెటాల్‌ తాగారు?

చదువుపై ఒత్తిడి కారణమా?హాస్టల్‌ పరిస్థితులు స రిగా లేకనా? ఉపాధ్యాయుల ప్రవర్తనతో ఒత్తిడి పె రిగి విద్యార్థులు డెటాల్‌ తాగారా? అనే ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు బయటకు రాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. హాస్టల్‌ పరిస్థితులపై అనుమానాలు ఉన్నాంటున్నారు. పర్యవేక్షణ లోపమా? ఆరోగ్య, భద్రతాత ప్రమాణాలు పాటిస్తున్నారా? విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై శ్రద్ధ ఉందా?అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. హాస్టల్‌లోకి డెటాల్‌కు అనుమతి లేదు. విద్యార్థులకు అలర్జీ సమస్య తలెత్తడంతో చేతులకు రాసుకునేందుకు ఇంటి నుంచి తీ సుకొచ్చి ఉంటారని, లేదా తల్లిదండ్రులు విజిట్‌కు వచ్చినప్పుడు తెచ్చిన బాటిల్‌ను రహశస్యంగా దాచుకుంటున్నారని సమాచారం. మొదటి రోజు ఘటన జరిగిన తర్వాత విద్యార్థుల నుంచి డెటాల్‌, షాంపూ, ఇతరత్రా వస్తువులు స్వాధీనం చేసుకున్నా.. శనివారం మరోఇద్దరు తాగడం అనుమానాలకు తావిస్తోంది. హాస్టల్‌ నుంచి వెల్లిపోయేందుకు విద్యార్థులు ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసుకొని డెటాల్‌ తాగడం లేదా చెవిలో యాసిడ్‌ పోసుకుకోవాలని అనుకున్నట్లు తెలుస్తోంది. ఇలా చేస్తే హాస్టల్‌ఉక సెలవులు వస్తాయని అనుకున్నట్లు సమాచారం. విద్యార్థులు ఇంత అసౌకర్యానికి ఎందుకు లోనవుతున్నారనేది తెలియాల్సి ఉంది.

తల్లిదండ్రులు, ప్రజల ఆందోళన

హాస్టల్‌లో జరిగిన ఈ ఘటనతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. తమ పిల్లలు సురక్షితంగా ఉన్నారా? అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. స్థానికులు కూడా హాస్టల్‌ నిర్వహణపై విచారణ జరపాలని డిమాండ్‌ చేస్తున్నారు. పండుగకు ఇంటికి వెళ్లేందుకు డెటాల్‌ సిప్‌ చేశారని, విద్యార్థులకు వైద్యం అందించామని, ఎలాంటి ఇబ్బంది లేదని ప్రిన్సిపాల్‌, జిల్లా సాంఘిక సంక్షేమ గురుకులాల విద్యాలయాల సంస్థ సమన్వయ అధికారి ఉటూరి శ్రీనాథ్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement