సూపరింటెండెంట్‌ హైదరాబాద్‌లోనా? | - | Sakshi
Sakshi News home page

సూపరింటెండెంట్‌ హైదరాబాద్‌లోనా?

Jul 26 2026 7:42 AM | Updated on Jul 26 2026 7:42 AM

కోల్‌సిటీ: గోదావరిఖని ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి(జీజీహెచ్‌) సూపరింటెండెంట్‌ హైదరాబాద్‌లో ఉంటే.. ఇక్కడి సమస్యలు ఎలా పరిష్కారమవుతాయ ని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎస్‌.వీరయ్య ప్ర శ్నించారు. శనివారం ఆయన జీజీహెచ్‌ను సందర్శించారు. ఆర్‌ఎంవో కృపాబాయితో సమావేశమయ్యారు. సదుపాయాలు, శానిటేషన్‌, భద్రత, పే షెంట్ల సంరక్షణ తదితర అంశాలపై చర్చించారు. వీ రయ్య మాట్లాడుతూ, మూడు జిల్లాల నుంచిరోజూ సుమారు 1,500 మంది పేషెంట్లు ఆస్పత్రికి వస్తు న్నా వసతులు లేవన్నారు. ఈ ప్రాంతంలో దుమ్ము, కాలుష్యంతో మూత్రపిండాల సమస్యలు అధికంగా ఉన్నా, నెఫ్రాలజిస్టు లేకపోవడం బాధాకరమన్నా రు. 250 మంది వైద్యులు అవసరమైన ఆస్పత్రిలో వైద్యుల కొరత వేధిస్తోందని, ఉన్నతాధికారుల పో స్టులు కూడా ఖాళీగా ఉండడంతో సేవలు అందడం లేదని తెలిపారు. పేషెంట్‌ కేర్‌, శానిటేషన్‌, సెక్యూరిటీ సిబ్బందికి తరచూ విధులు మార్చడం, రెండు, మూడు నెలలకోసారి కాకుండా ప్రతీనెల వేతనాలు చెల్లించడంతోపాటు సిబ్బంది సంఖ్య పెంచాలని డిమాండ్‌ చేశారు. సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ స భ్యులు ఎ.ముత్యంరావు, వేల్పుల కుమారస్వామి, ఎం.రామాచారి, సీనియర్‌ నాయకుడు టి.రాజారె డ్డి, జిల్లా కమిటీ సభ్యులు ఎన్‌.భిక్షపతి, మెండ శ్రీనివాస్‌, జి.జ్యోతి, శైలజ, శివరాంరెడ్డి పాల్గొన్నారు.

ఆస్పత్రి సమస్యలు ఎవరు పరిష్కరించాలి?

సీపీఎం కేంద్ర నేత ఎస్‌.వీరయ్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement