మంథనిరూరల్: పదో తరగతి విద్యార్థుల కోసం సాక్షి దినపత్రిక అందజేసిన స్టడీ మెటీరియల్ విద్యార్థులకు వరంగా మారింది. ఇందులో పొందుపర్చిన కీ పాయింట్స్ ఆధారంగా అత్యధిక మార్కులు సాధించారు. పెద్దపల్లి జిల్లా మంథని మండలం కన్నాల ప్రభుత్వ జెడ్పీహెచ్‌ఎస్‌లో జనవరి 22న సాక్షి స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు. పరీక్షల సమయం సమీపించడంతో చాలామంది సాక్షి స్టడీ మెటీరియల్‌పై ఆధారపడి చదువుకున్నారు. అందులోని కీ పాయింట్స్‌ను చదువుకుని పరీక్షలు రాసి అత్యధిక మార్కులు సాధించారు. ఇందులో ఎస్‌కే తస్మీరా(545), పొయిల శ్రీవన్(534), బి.రామ్ చరణ్(524) మార్కులు సాధించిచారు.


