కరీంనగర్‌స్పోర్ట్స్: క్రీడాకారుల కేరింతలు, ఆకట్టుకు న్న మార్చ్‌ఫాస్ట్, సాంస్కృతిక ప్రదర్శనలు, క్రీడాస్ఫూర్తిని ప్రతిబింబించే ఉత్సాహభరిత వాతావరణం మధ్య కరీంనగర్ కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఈ–టెక్నో పాఠశాలలో సీబీఎస్‌ఈ క్లస్టర్–7 బాలికల ఖోఖో చాంంపియన్‌షిప్ పోటీలు శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి అండర్ –14 విభాగంలో 46, అండర్– 17లో 55, అండర్– 19 విభాగంలో 13 జట్లు పోటీల్లో పాల్గొన్నాయి. మొత్తం 104 జట్లు పోటీల్లో నువ్వా నేనా అన్నట్లు పోటీపడనున్నాయి. అంతకుముందు పోటీలను చొప్పదండి ఎమ్మెల్యే ఎమ్మెల్యే, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం, అదనపు కలెక్టర్ అశ్వినితానాజీ వాకాడే, అసిస్టెంట్ కలెక్టర్ పి.హరిప్రసాద్, సీబీఎస్‌ఈ రీజనల్ ఆఫీసర్ జంగం సునీల్‌కుమార్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, చదువుతో పాటు క్రీడల్లోనూ ప్రతిభ కనబరిచినప్పుడే విద్యార్థులకు సమగ్ర వ్యక్తిత్వ వికాసం సాధ్యమవుతుందన్నారు. అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకాడే మాట్లాడుతూ, క్రీడలు విద్యార్థుల్లో ఏకాగ్రత, ఆత్మవిశ్వాసాన్ని పెంచి ఒత్తిడిని తగ్గిస్తాయన్నారు. లక్ష్యాలను నిర్దేశించుకుని విద్యతో పాటు క్రీడల్లో రాణించాలని సూచించారు. అల్ఫోర్స్ అధినేత వి.నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ, విద్యతో పాటు క్రీడలకు సమాన ప్రాధాన్యం ఇస్తూ అత్యాధునిక వసతులు, అనుభవజ్ఞులైన కోచ్‌లతో విద్యార్థులను తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. క్రీడాస్ఫూర్తితో నిబంధనలు పాటిస్తూ పోటీలను విజయవంతం చేయాలన్నారు. క్రీడాకారుల మార్చ్‌ఫాస్ట్, విద్యార్థుల సాంస్కతిక కార్యక్రమాలు అలరించాయి. పోటీల పరిశీలకులు భరత్‌కుమార్, జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్ష కార్యదర్శులు నందెల్లి మహిపాల్, గసిరెడ్డి జనార్ధన్‌రెడ్డి, ఖోఖో సంఘం కార్యదర్శి వై.మహేందర్‌రావు, తెలంగాణ ఖోఖో అసోసియేషన్ రెఫరీస్ బోర్డ్ కన్వీనర్ వంగపల్లి సూ ర్యప్రకాష్, ప్రజాప్రతినిధులు వాసాల రమేశ్, వే ముల చంద్రశేఖర్, మధుసూదన్‌రెడ్డి పాల్గొన్నారు.
తలపడుతున్న క్రీడాకారులు
మార్చ్‌ఫాస్ట్‌లో క్రీడాకారులు
అట్టహాసంగా ప్రారంభమైన సీబీఎస్‌ఈ క్లస్టర్–7 ఖోఖో పోటీలు
తెలంగాణ, ఏపీ నుంచి 104 బాలికల జట్లు హాజరు
పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం


