జాతీయ స్థాయి శిక్షణకు ఎంపిక | - | Sakshi
Sakshi News home page

జాతీయ స్థాయి శిక్షణకు ఎంపిక

Jul 25 2026 1:47 AM | Updated on Jul 25 2026 1:47 AM

పెగడపల్లిలో ఎక్సైజ్‌ తనిఖీలు

పెద్దపల్లి: ఆంగ్లభాష బోధనలో నైపుణ్యం పెంపు ల క్ష్యంగా ఈనెల 27 నుంచి 31వ తేదీ వరకు కర్ణాట కలోని మైసూరులో నిర్వహించే జాతీయ స్థాయి శిక్షణకు పెద్దపల్లి జిల్లా రా మగుండంలోని జెడ్పీ హైస్కూల్‌(పీఎంశ్రీ)కు చెందిన స్కూల్‌ అసిస్టెంట్‌ గడ్డం జగదీశ్వర్‌ ఎంపికయ్యారు. ఆంగ్ల భాష బోధన వ్యూహా లు, అభ్యసన ఫలితాల ఆధారిత బోధన, విద్యార్థి–కేంద్రిత అభ్యాసం, అక్షరాస్యత, భాషా వికాసం, సాంకేతికత వినియోగం వంటి అంశాలపై ఇందులో శిక్షణ అందించనున్నారు. డీఈవో శారద, జిల్లా అకడమిక్‌ మానిటరింగ్‌ ఆఫీసర్‌ పీం షేక్‌, ఈఎల్‌టీసీ మాజీ ఇన్‌చార్జి చెరుకు ప్రద్యుమ్న కుమార్‌, ఎల్టా జిల్లా ప్రధాన కార్యదర్శి డి.నాగరాజు తదితరులు జగదీశ్వర్‌ను అభినందించారు.

కాల్వశ్రీరాంపూర్‌: ఇద్దరు గుడుంబా తయారీదారులు, విక్రేతలను తహీసీల్దార్‌ రాముడు ఎదుట ఎకై ్సజ్‌ అధికారులు శుక్రవారం బైండోవర్‌ చేశారు. గుడుంబా తయారీ, ముడిపదా ర్థాలు విక్రయిస్తుండగా పట్టుకున్నట్లు ఎకై ్సజ్‌ ఎస్సై చిరంజీవి తెలిపారు. నిందితుల నుంచి 25 కిలోల పటిక, 8 లీటర్ల గుడుంబా స్వాధీ నం చేసుకున్నట్లు వివరించారు. కానిస్టేబుళ్లు కోటేశ్వర్‌, అనిల్‌, కవిత పాల్గొన్నారు.

పాముకాటుతో మహిళ మృతి

రామగుండం: పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం పెద్దంపేట గ్రామానికి చెందిన రెవేల్ల సమ్మక్క(45) గురువారం రాత్రి ఇంట్లో పాముకాటుకు గురైంది. కుటుంబసభ్యులు గోదావరిఖని ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందింది. మృతురాలి కుమారుడు రేవెల్లి హన్మంతు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొన్నట్లు ఎస్సై వెంకటస్వామి తెలిపారు.

గుండెపోటుతో అగ్నిమాపక వాహనం డ్రైవర్‌ మృతి

జమ్మికుంట: పట్టణంలో ని అగ్ని మాపక కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న వాహనం డ్రైవర్‌(పోలీ సు) గుండెపోటుతో శుక్రవారం మృతిచెందాడు. సీఐ రామకృష్ణ వివరాల ప్రకారం.. వీణవంకకు చెందిన మోఠం అరవింద్‌(30) జమ్మికుంట అగ్నిమాపక కేంద్రం వాహన డ్రైవర్‌గా గురువారం విధులకు హాజ రయ్యాడు. శుక్రవారం చాతిలో నొప్పి రాగా.. అకస్మాత్తుగా కింద పడిపోయాడు. ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందాడు. గత సంవత్సరం ఇల్లందకుంట మండలం టేకుర్తి గ్రామానికి యువతితో వివాహం జరిగింది. 2 గ్రామాల్లో విషాదం అలుముకుంది. మృతుడి తండ్రి మోఠం సారయ్య ఫిర్యాదు చేశారు.

28న స్పాట్‌ అడ్మిషన్లు

పెద్దపల్లి: సుల్తానాబాద్‌ మండలం భూపతిపూర్‌లోని మహాత్మా జ్యోతిబా పూలే బీసీ సంక్షేమ గురుకులం(బాలురు)లో ఈనెల 28న ఉద యం 10.00 గంటలకు స్పాట్‌ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు జిల్లా సమన్వయకర్త మానీదీప్తి తెలిపారు. ఇంటర్‌లో ప్రథమ సంవత్సరంలో ప్రవేశాల కోసం స్పాట్‌ అడ్మిషన్లు చేపట్టామన్నారు. వివరాల కోసం 95504 46246 నంబర్‌లో సంప్రదించాలని ఆయన కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement