పెద్దపల్లిరూరల్: స్థానిక రైల్వేస్టేషన్ ఆధునికీకరణ పనులను సికింద్రాబాద్ రైల్వే డివిజనల్ మేనేజర్ గోపాలకృష్ణన్ శుక్రవారం పరిశీలించారు. అధికారు లు, సిబ్బందికి పలు సూచనలిచ్చి పనుల్లో వేగం పెంచాలని ఆదేశించినట్లు అధికారవర్గాలు తెలిపాయి.
రైల్వేస్టేషన్ సందర్శన
రామగుండం: దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజనల్ మేనేజర్ గోపాలకృష్ణన్ స్థానిక రైల్వేస్టేషన్‌ను సందర్శించారు. డీఆర్‌యూసీసీ ప్రతినిధి అనుమాస శ్రీనివాస్ డీఆర్‌ఎంను మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి సన్మానించారు. పలు రైళ్ల హాల్టింగ్‌పై వినతిపత్రం అందజేశారు.
లోకో పైలెట్ల రెస్ట్‌రూమ్ ప్రారంభం
ఓదెల: కొలనూర్ రైల్వేస్టేషన్ సమీపంలో గార్డులు, లోకోపైలట్ల విశ్రాంతి గదిని డీఆర్‌ఎం గోపాలకృష్ణన్ ప్రారంభించారు. కొలనూర్‌లో సిర్‌పూర్‌కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్, అజ్నీ ప్యాసింజర్ రైళ్లను హల్టింగ్ సౌకర్యం కల్పించాలని సర్పంచులు పల్లె కనుకయ్య, గ్యారవేని విజయ, ఉపసర్పంచ్ పాకాల సంపత్‌రెడ్డి వినతిపత్రం సమర్పించారు. నాయకులు బైరి రవిగౌడ్, మహేందర్, ఢిల్లీ శంకర్, పాకాల కరుణాకర్‌రెడ్డి, నాగపూరి రవిగౌడ్, వార్డుసభ్యుడు రమేశ్ పాల్గొన్నారు.


