ట్రినిటీలో ఫ్రెషర్స్‌ డే వేడుకలు | - | Sakshi
Sakshi News home page

ట్రినిటీలో ఫ్రెషర్స్‌ డే వేడుకలు

Jul 24 2026 1:39 AM | Updated on Jul 24 2026 1:39 AM

కరీంనగర్‌కల్చరల్‌: ట్రినిటీ జూనియర్‌ కళాశాలలో 2026–28 విద్యా సంవత్సరానికి ఇంటర్‌ విద్యార్థులకు ఫ్రెషర్స్‌ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. అమ్మాయిలు, అబ్బాయిలకు వేర్వేరుగా ఏర్పాటు చేసిన వేదికలపై నిర్వహించిన కార్యక్రమానికి కళాశాల ఫౌండర్‌, మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. జగిత్యాల డిప్యూటీ కలెక్టర్‌, ట్రినిటీ పూర్వ విద్యార్థిని కన్నం హరిణి, గ్రూప్‌–1లో విజయం సాధించిన సందవేణి ప్రియాంక, బింగి కీర్తన ప్రత్యేక అతిథులుగా పాల్గొన్నారు. మనోహర్‌రెడ్డి మాట్లాడుతూ నాణ్యమైన విద్యతో వేలాది మంది విద్యార్థులను ఇంజినీర్లు, వైద్యులు, ఉన్నతాధికారులుగా తీర్చిదిద్దామని తెలిపారు. ట్రినిటీలో చదివిన తన ప్రయాణమే నేటి విజయానికి పునాది అని కన్నం హరిణి పేర్కొన్నారు. అనంతరం గ్రూప్స్‌లో విజయం సాధించిన పూర్వ విద్యార్థులు, రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబర్చిన ఇంటర్‌ విద్యార్థులు, నీట్‌, జేఈఈ, ఐఐటీ, ఎన్‌ఐటీ ర్యాంకర్లు, అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను కళాశాల యాజమాన్యం సన్మానించింది. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు వేడుకలకు ఆకర్షణగా నిలిచాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement