కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలి | - | Sakshi
Sakshi News home page

కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలి

Jul 23 2026 2:18 AM | Updated on Jul 23 2026 2:18 AM

● మంథనిలో ప్రజాసంఘాల నిరసన

మంథని: నీట్‌ పరీక్ష పేపర్‌ లీకేజ్‌ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో స్థానిక అంబేడ్కర్‌ చౌరస్తాలో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో బుధవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులు, యువతపై పోలీసులు చేసిన దాడిని ఖండిస్తూ ఆందోళన చేపట్టారు. నాయకులు మాట్లాడుతూ, నీట్‌ పేపర్‌ లీకేజీ దేశవ్యాప్తంగా విద్యార్థుల భవిష్యత్‌ను అనిశ్చితిలోకి నెట్టిందన్నారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై టియర్‌ గ్యాస్‌, వాటర్‌ కెనాన్లు, రబ్బర్‌ బుల్లెట్లు ప్రయోగించడం కిరాతక చర్య అని విమర్శించారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు ఆర్ల సందీప్‌, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బూడిద గణేశ్‌, నాయకులు అఖిల్‌, మహేందర్‌, రణధీర్‌, మనోజ్‌, సాయి కిరణ్‌, రామ్‌ చరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement