ఎమ్మెల్యే క్యాంప్‌ ఆఫీస్‌ ముట్టడి | - | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే క్యాంప్‌ ఆఫీస్‌ ముట్టడి

Jul 23 2026 2:12 AM | Updated on Jul 23 2026 2:12 AM

● కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ దిష్టిబొమ్మ దహనం ● జిల్లా కేంద్రంలో బీజేపీ శ్రేణుల నిరసన

పెద్దపల్లిరూరల్‌: దేశద్రోహులతో కుమ్మకై ్క మనదేశాన్ని ముక్కలు చేసేందుకు కాంగ్రెస్‌ కుట్రలు చేస్తోందని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లె సదానందం, రాష్ట్ర నాయకుడు నల్ల మనోహర్‌రెడ్డి ఆరోపించారు. ఢిల్లీలో ప్రధాని ఇంటిఎదుట కాంగ్రెస్‌ నేతలు ధర్నా చేయడాన్ని నిరసిస్తూ బీజేపీ పట్టణ, మండల అధ్యక్షుడు రాకేశ్‌, రమేశ్‌ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు. రాహుల్‌గాంధీ దిష్టిబొమ్మ దహనం చేశారు. స్కాంల కాంగ్రెస్‌ను గద్దెదింపిన ప్రజలు నరేంద్రమోదీ సారథ్యంలో అందిస్తున్న నీతివంతమైన పాలనను చూసి వరసగా మూడుసార్లు అధికారం అప్పగించారని అన్నారు. నాయకులు శివంగారి సతీశ్‌, రాజం మహంత, సమ్మయ్య, ఈర్ల శంకర్‌, తిరుపతి, వెల్లంపల్లి శ్రీనివాసరావు, మేకల శ్రీనివాస్‌, మంథెన కృష్ణ, సతీశ్‌, ఉప్పు కిరణ్‌, మనోహర్‌, రాజు, సురేందర్‌, అఖిల్‌, సందీప్‌, మధుకర్‌, అనిల్‌, అంజి, శివ, ఫహీం తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement