గోదావరిఖనిటౌన్: గోదావరిఖని పారిశ్రామిక, లేబర్ కోర్టు చైర్‌పర్సన్, అదనపు జిల్లా న్యాయమూర్తి కోట్ల లావణ్య బాల్‌రెడ్డి బదిలీ అయ్యా రు. రాష్ట్రవ్యాప్తంగా ముగ్గురు జిల్లాస్థాయి న్యాయమూర్తులను బదిలీ చేస్తూ హైకోర్టు రిజిస్ట్రార్(జనరల్) మంగళవారం ఉత్తర్వూలు జారీచేశారు. బదిలీ అయినవారిలో ఖని జడ్జి లావణ్య బాల్‌రెడ్డి ఉన్నారు. జిల్లా అదనపు జడ్జిని వనపర్తి జిల్లా పోక్సో కోర్టుకు బదిలీ చేశారు. సరిగ్గా నెలరోజుల క్రితమే జడ్జి లావణ్య బాల్‌రెడ్డి గోదావరిఖనికి బదిలీపై వచ్చారు.
నిర్లక్ష్యం చేస్తే చర్యలు
మంథని: అభివృద్ధి పనుల్లో అలసత్వం పనికిరాదని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సూచించారు. పట్టణంలో చేపట్టిన అభివృద్ధి పనులను మంత్రి మంగళవారం పరిశీలించారు. నాణ్యతతో కూడిన పనులు చేపట్టాలన్నారు. గోదా వరి పుష్కరాలలోపు నదీతీరంలో నిర్మించే ఘాట్ల వద్ద నీటిసౌకర్యం కల్పించేలా ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. మంథని మున్సిపల్ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి చేయాలని ఆయన అన్నారు.
ప్రతీ ఓటరు పేరు ఉండాలి
గోదావరిఖని: జాబితాలో ప్రతీ ఓటరు పేరు ఉండేలా బీఎల్‌ఏలు ప్రణాళికతో వ్యవహరించాలని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్ సూచించారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఎల్‌ఏ, కార్పొరేటర్లు, డివి జన్ ఇన్‌చార్జిలతో మంగళవారం సర్‌పై ఆయన సమీక్షించారు. ప్రతీ బీఎల్‌ఏ తన పరిధిలోని ఓటరు వివరాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. ఓటర్ల వద్దకే వెళ్లి సర్ ప్రక్రియలో నమోదు పూర్తిచేయాలని సూచించారు. మే యర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య, కాంగ్రెస్ కార్పొరేషన్ అధ్యక్షుడు బొంతల రాజేశ్ పాల్గొన్నారు.
కేటీఆర్‌కు ఘనస్వాగతం
ధర్మారం: మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటలో నిర్వహిస్తున్న రైతు సదస్సుకు హాజరయ్యేందుకు వెళ్తున్న బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్‌కు మండల కేంద్రంలో మంగళవారం ఘనస్వాగతం లభించింది. సింగిల్‌విండో మాజీ చైర్మన్ ముత్యాల బలరాంరెడ్డి కేటీఆర్‌కు గజమాలతో సన్మానం చేశారు. మహిళలు బతుకమ్మలతో స్వాగతం పలికి వీర తిలకందిద్దారు. వెల్గటూర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గుండాటి దీపిక, నాయకులు వ్యాల్ల హరీశ్‌రెడ్డి, ముత్యాల బల రాంరెడ్డి, రాసూరి శ్రీధర్, ఆవుల వేణుగోపాల్, శ్రీనివాస్, అజ్మీర మల్లేశ్‌నాయక్, పు స్కూరి రామారావు, తుమ్మల రాంబాబు, గాజుల రాజు, దేవి నళినీకాంత్, పాకాల రాజయ్య, మోతె కనుకయ్య, మంద శ్రీనివాస్, ఎండీ రఫీ, కాంపెల్లి అపర్ణ, ఆవుల లత, మార్క సంధ్య, ఆకారి సత్యం, సాన రాజేందర్, అమరపెల్లి నారాయణ తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులకు న్యాయం చేయాలి
పెద్దపల్లి: ‘నీట్’ రాసిన విద్యార్థులకు న్యాయం చేయాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు డిమాండ్ చేశారు. స్థానిక అంబేడ్కర్ విగ్రహం వద్ద మంగళవారం కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు ఆర్ల సందీప్, కార్యదర్శి జిల్లాల ప్రశాంత్ మాట్లాడుతూ, నీట్ రాసిన సుమారు 22 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్‌ను కేంద్ర ప్రభుత్వ విధానాలు దెబ్బతీస్తున్నాయన్నారు. నాయకులు మామిడిపల్లి అరవింద్, బాలాజీ, నరేశ్, ప్రణయ్, రఘు, రాజ్‌కుమార్, నవీన్, అభిలాష్ పాల్గొన్నారు.


