కమాన్‌పూర్/రామగిరి: ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. కమాన్‌పూర్, రామగిరి మండలాల్లో ఆయన మంగళవారం పర్యటించారు. గుండారం ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రభుత్వ పాఠశాల, కమాన్‌పూర్ పీహెచ్‌సీ, కొత్త తహసీల్దార్ భవనం, పేంచికల్‌పేటలో ఎస్‌ఐఆర్ ప్రక్రియ, రామగిరి మండలం పన్నూర్‌లో చేపట్టిన తహసీల్దార్ కార్యాలయ భవన నిర్మాణం ప్రగతి పరిశీలించారు. మేడిపల్లిలోని ఇండస్ట్రియల్ పార్క్ స్థలంపై ఆరా తీశారు. కమాన్‌పూర్, రామగిరి తహసీల్దార్లు వాసంతి, సుమన్, అధికారులు వెంకటేశ్వర్లు, శైలాజారాణి, ఏఈ జగదీశ్, ఆర్‌ఐ స్రవంతి, సర్పంచ్ చిందం మహేశ్ పాల్గొన్నారు.
రేపు కౌన్సిలర్లకు శిక్షణ
పెద్దపల్లిరూరల్/పెద్దపల్లి: జిల్లాలోని మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లకు హైదరాబాద్‌లో గురువారం ఒకరోజు శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా అధికారులు మంగళవారం తెలిపారు. రామగుండం కార్పొరేటర్లతోపాటు పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని మున్సిపల్ కౌన్సిలర్లకు ఈనెల 23న శిక్షణ ఉంటుందన్నారు. వీరు హైదరాబాద్‌కు తరలివెళ్లేందుకు వీలుగా వాహనాలను సిద్ధం చేయాలని, ఓ కో ర్టినేటర్‌ను నియమించుకోవాలని కమిషనర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి.


