పెద్దపల్లి ప్రాంతంలో సోమవారం రాత్రి కురిసిన వర్షానికి సబ్బితం శివారులోని గట్టుసింగారం జలపాతం జాలువారుతోంది. జలపాతం అందాలను తిలకించేందుకు సమీప మండలాలు, గ్రామాల నుంచి భారీసంఖ్యలో సందర్శకులు తరలివస్తున్నారు. ప్రకృతి సోయగాన్ని తిలకించి పరవశిస్తున్నారు. జలపాతం అభివృద్ధికి ప్రభుత్వం ఇప్పటికే రూ.6 కోట్లు మంజూరు చేయగా.. విప్ విజయరమణారావు పనులు ప్రారంభించిన విషయం విదితమే. పనులు పూర్తయితే గట్టుసింగారం జలపాతం పర్యాటక కేంద్రంగా మారి సందర్శకులకు మరింత ఆహ్లాదం పంచుతుంది.
– పెద్దపల్లిరూరల్


