ఇసుక తరలిస్తే ఊరుకునేది లేదు | - | Sakshi
Sakshi News home page

ఇసుక తరలిస్తే ఊరుకునేది లేదు

Jul 21 2026 12:23 AM | Updated on Jul 21 2026 12:23 AM

ఓదెల: ‘నా ఏరియా నుంచి ఇసుక తరలిస్తే ఊరుకోబోమ’ని ప్రభుత్వ విప్‌ చింతకుంట విజయరమణా రావు హెచ్చరించారు. పొత్కపల్లి మానేరులో ఇసుక లోడ్‌చేసిన లారీలను గమనించి నాయకులు విప్‌కు సమాచారం అందించారు. స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. పెద్దపల్లి నియోజకవర్గంలోని మానేరు సరిహద్దుల నుంచి ఇసుక తరలిస్తే సహించబోనని మాట ఇచ్చానని గుర్తుచేశారు. ఈసందర్భంగా ఎస్సై సనత్‌కుమార్‌రెడ్డి మానేరులోని మూడు ఇసుక లారీలను పట్టుకున్నారు.

బస్తీవాసులకు మెరుగైన వైద్యం

పెద్దపల్లి: బస్తీవాసులకు మెరుగైన వైద్యం అందించేందుకే బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేస్తున్నామని ప్రభుత్వ విప్‌ విజయరమణారావు అన్నారు. సుల్తానాబాద్‌ ఏడోవార్డులో బస్తీదవాఖానా నిర్మాణం కో సం శంకుస్థాపన చేసి మాట్లాడారు. అనంతరం వ ర్షాలు కురవాలని గొల్లపల్లిలో బొడ్రాయికి జలాభి షేకం చేశారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అంతటి అన్నయ్యగౌడ్‌, మున్సిపల్‌ చైర్మన్‌ బిరుదు రాధాకృష్ణ, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మినుపాల ప్రకాశ్‌రావు, సింగిల్‌విండో చైర్మన్‌ శ్రీగిరి శ్రీనివాస్‌, మున్సిపల్‌ వైస్‌ చైర్‌ పర్సన్‌ అంతటి పుష్పలత, కౌన్సిలర్‌ ఊట్ల వరప్రదీప్‌ పాల్గొన్నారు.

ప్రభుత్వ విప్‌ విజయరమణారావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement