● బీఆర్‌ఎస్ నేత కేటీఆర్‌కు ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ సవాల్
రామగుండం: ‘కాంగ్రెస్ ప్రజాపాలనలో ఉద్యోగా లు భర్తీ చేసినట్లు నిరూపిస్తాం.. నీ మాటకు కట్టుబ డి రాజకీయ సన్యాసం పుచ్చుకో కేటీఆర్’ అని రా మగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ఠాకూర్ సవాల్ విసిరారు. రామగుండంలోని తన నివాసంలో సో మవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గ్రూప్స్‌లో 17,326, పోలీస్‌శాఖలో 16,126, వైద్యశాఖలో 11,664, రెసిడెన్షియల్ ఇనిస్టిట్యూషన్స్‌లో 8,400, స్కూల్ ఎడ్యుకేషన్‌లో 10,006, రెవెన్యూలో 4,682, సింగరేణిలో 441, జెన్‌కోలో 635, ఎన్‌పీడీసీఎల్‌లో 470తో పాటు ఇతర విభాగాల్లో 914 ఉ ద్యోగాలు భర్తీ చేశామని తెలిపారు. వీటితోపాటు వ్యవసాయం, వెటర్నరీ, బీసీ వెల్ఫేర్, ఎన్విరాన్‌మెంట్, అటవీ, సైన్స్, టెక్నాలజీ, ఫైనాన్స్ సెక్రటేరిటట్, ఫుడ్, సివిల్ సప్లయ్, సాధారణ పరిపాలన, హయ్యర్ ఎడ్యుకేషన్ తదితర విభాగాల్లో నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించామన్నారు. మే యర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతిపెల్లి ఎల్లయ్య, నాయకులు దీటి బాలరాజు, అంజులు, సతీశ్‌గౌడ్, కుమార్ తదితరులు ఉన్నారు.


