రైతుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేయాలి | - | Sakshi
Sakshi News home page

రైతుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేయాలి

Jul 19 2026 11:27 PM | Updated on Jul 19 2026 11:27 PM

పెద్దపల్లి: రైతుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేయాలని ప్రభుత్వ విప్‌, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు కోరారు. ఎలిగేడు మండలం శివపల్లిలోని తన నివాసంలో పెద్దపల్లి సింగల్‌విండో పాలకవర్గం విప్‌ను ఆదివారం మర్యాద పూర్వకంగా కలిశారు. తమ నియామకానికి స హకరించినందుకు వారు కృతజ్ఞతలు తెలిపారు. విప్‌ను కలిసినవారిలో పర్సన్‌ ఇన్‌చార్జి ముత్యాల నరేశ్‌ ముదిరాజ్‌, డైరెక్టర్లు తదితరులు ఇందులో ఉన్నారు. సహకార సంఘం ద్వారా రైతులకు అన్ని సేవలు అందించాలని, ప్రభుత్వ పథకాలు, రుణ సదుపాయాలు వర్తింపజేయాలని విప్‌ వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో పీఎసీఎస్‌ కార్యదర్శి మెట్టు మధు, డైరెక్టర్లు నాంసాని సతీశ్‌, ఎనగందుల రవీందర్‌, పిన్‌రెడ్డి సుధాకర్‌ రెడ్డి, మేకల మల్లేశ్‌, కలవేన సంపత్‌, జూపల్లి తిరుపతిరావు, ధోనేటి స్వరూప, వేల్పుల శ్రీనివాస్‌, పూరేళ్ల శంకర్‌గౌడ్‌, భగీరం శ్రీనివాస్‌, ఈదునూరి ప్రసన్న, మానుపాటి రవి తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ విప్‌ విజయరమణారావు

ఎలిగేడు పీఏసీఎస్‌ పాలకవర్గానికి అభినందనలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement