ఎల్లారెడ్డిపేట: వర్షాలు లేక వాడిపోతున్న ఈ పత్తిచేను రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట శివారులోది. గ్రామానికి చెందిన మద్దుల అంజిరెడ్డి తనకున్న ఐదెకరాల్లో పత్తి సాగుచేశారు. ఇప్పటి వరకు వర్షాలు కురువకపోవడంతో పత్తి మొక్కలు వాడిపోతున్నాయి. పరిస్థితి ఇలాగే ఉంటే మొక్కలు బతికేలా లేవని అంజిరెడ్డి ఆందోళన చెందుతున్నాడు. ఇప్పటికే రూ.50వేల పెట్టుబడి పెట్టానని, మరో వారం పరిస్థితి ఇలాగే ఉంటే మొత్తం బీడుగా మారుతుందని వాపోయాడు. ఎల్నినో ప్రభావంతో నీటి వనరుల లభ్యతను చూసుకొని పంటలు వేయాలని, సాగవుతున్న పత్తిని కాపాడుకునేందుకు 2 శాతం యూరి యా ద్రావణాన్ని పిచికారీ చేయాలని ఏవో రాజశేఖర్ వివరించారు.


