పెద్దపల్లిరూరల్:
మక్క పండించుడే పాపమా.. ఈసారి ధాన్యం దిగుబడి కొద్దిగా పెరిగితే అమ్ముకునేందుకు అవస్థలు తప్పవా? అని అన్నదాతలు ఆవేదన వ్య క్తం చేస్తున్నారు. అనేక కష్టాలకు ఓర్చి పంట పండించి విక్రయించేందుకు కొనుగోలు కేంద్రాల్లోనే నెలరోజులుగా గోసపడుతున్నా ఎవరూ పట్టించుకో రా? అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వడ్లు, మ క్కలు కొనుగోలు కేంద్రాల్లోనే నిల్వ ఉండగా మంగళవారం రాత్రి అకస్మాత్తుగా ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో వాటిని కాపాడుకునేందుకు రైతులు నానాతంటాలు పడ్డారు. పెద్దపల్లి వ్య వసాయ మార్కెట్‌ను బుధవారం పరిశీలించగా ధా న్యం, మక్కలు తడవకుండా కప్పిన టార్పాలిన్ల చుట్టూ చేరినవర్షపు నీటిని ఎత్తిపోస్తు కనిపించారు.
వర్షానికి తడిసిన ధాన్యం
తూకం వేసేందుకు సంచుల్లో నింపి మార్కెట్‌లో సిద్ధంగా ఉంచిన ధాన్యం వర్షానికి తడిసింది. బుధవారం ఉదయం రైతులు సంచుల్లో నుంచి ధాన్యం కిందపోసి ఆరబెట్టాల్సిన పరిస్థితులేర్పడ్డాయి. నెలరోజులు దాటినా తూకం వేయకపోవడంతో ఈ పరిస్థితులు తలెత్తాయని రైతులు ఆవేదన చెందారు. యార్డులో పనిచేసే వారికి కొంతముట్టజెబితే వెంటనే తూకం వేస్తున్నారని, పైసలు ఇవ్వని రైతుల వైపు చూసేవారే లేరని ఆవేదన చెందుతున్నారు.
మక్కరైతు పరిస్థితి మరీ దయనీయం
మక్కలను అమ్ముకుందామని కొనుగోలు కేంద్రాని కి వచ్చిన రైతుల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. కౌలురైతుల బాధలైతే చెప్పనలవికాదు. మక్క లు తూకం వేసేందుకు రూ.2 వేల నుంచి రూ.5వేల వరకు ఇవ్వాల్సిందేనని సదరు అధికారి డిమాండ్ చే స్తున్నారని, లేదంటే వేలిముద్ర వేసేందుకు కొర్రీలు పెడుతున్నాడని అన్నదాతలు ఆరోపించారు. డీసీఎంఎస్ అధికారిని రైతులకు సౌకర్యంగా ఉండేలా మార్కెట్‌యార్డులో ఉండేలా చూడాల్సింది పోయి తమను ఎండలో ఎందుకు తిప్పుతున్నారని అడిగినా గోడు వినేవారే లేరని పేర్కొంటున్నారు. గన్నీ సంచులు, సుతిలిదారం కూడా రైతులే తెచ్చుకోవాల్సిన దుస్థితి ఉందంటున్నారు. కలెక్టర్ ఇతర ఉన్నతాధికారులు మక్క రైతుల బాధలపై ఆరా తీస్తే మార్కెట్‌లో జరిగే అవినీతి బాగోతం బయటపడుతుందని అంటున్నారు.
విరిగిపడిన చెట్లు, విద్యుత్ స్తంభాలు
పెద్దపల్లి: సుల్తానాబాద్ పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలు, వరషానికి రేకుల షెడ్లు నేలమట్టమయ్యాయి. చెట్లు విరిగి విద్యుత్ స్తంభాలపై ప డడంతో కరెంట్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. బుధవారం ఉదయం వరకు విద్యుత్ సరఫరా లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మున్సిప ల్ చైర్మన్ బిరుదు రాధాకష్ణ, కమిషనర్ రమేశ్ ఆయా ప్రాంతలను పరిశీలించారు. కౌన్సిలర్లు సిద్ధ తిరుపతి, వేగోళం అబ్బయ్యగౌడ్ పాల్గొన్నారు.
అర్ధరాత్రి కురిసిన భారీవర్షం
ఈదురుగాలులతో అతలాకుతలం
కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం
వర్షపు నీటిలో కొట్టుకుపోయిన మక్కలు
దిగుబడులను కాపాడుకునేందుకు రైతుల తంటాలు


