పెట్రో మోత | - | Sakshi
Sakshi News home page

పెట్రో మోత

May 18 2026 9:43 AM | Updated on May 18 2026 9:43 AM

న్యూస్‌రీల్‌

పెట్రోల్‌, గ్యాస్‌తో సామాన్యులకు కష్టాలు

లీటరుపై రూ.3 చొప్పున పెంపు

రవాణా వ్యయంతోపాటు నిత్యావసరాల ధరలు పెరిగే అవకాశం

భారం కానున్న నెలవారీ బడ్జెట్‌

సోమవారం శ్రీ 18 శ్రీ మే శ్రీ 2026

సాక్షి పెద్దపల్లి: ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదన్నట్లు ఉంది ప్రస్తుతం సామాన్యుల పరిస్థితి. ఇ ప్పటికే మండుతున్న ధరలతో అల్లాడిపోతున్న పే ద, మధ్యతరగతి ప్రజల జీవితాలను పెట్రో పిడుగు అల్లకల్లోలం చేస్తోంది. వాహనం బయటకు తీసేందుకు జంకేలా చేస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమరు ధరలు పెరుగుతన్న నేపథ్యంలో ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు ధరలు పెంచుతున్నాయి. పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో ఇప్పటికే కమర్షియల్‌ ఎల్పీజీ ధరలను భారీగా పెంచిన కేంద్రం ప్రభుత్వం.. తాజాగా లీటర్‌ పెట్రోల్‌పై సగటున రూ.3, డీజిల్‌పై రూ.3 పెంచుతూ నిర్ణయం తీసుకోవడం ఆందోళన కలిగిస్తోంది.

సీఎన్‌జీపైనా బాదుడే..

సీఎన్‌జీ వాహనదారులకు షాక్‌ ఇస్తూ కిలో సీఎన్‌జీపై కంపెనీలు రూ.2 పెంచాయి. పక్షం రోజులకు ఒకసారి ధరలు సవరించనుండటంతో పెట్రో ధర లు మరింత పెరిగే అవకాశముందని తెలుస్తోంది. ఇప్పటికే పెరిగిన ధరలతో రవాణా వ్యయం పెరిగి పరోక్షంగా నిత్యావసరాల ధరలు పెరుగుతాయని వాణిజ్య, వ్యాపార వర్గాలు వివరిస్తున్నాయి. దీంతోపాటు వ్యవసాయ రంగంపైనా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఆధునిక వ్యవసాయ పనుల్లో డీజిల్‌ వినియోగం పెరిగింది. దుక్కులు దున్నడం మొదలు, వరి కోతలు, ధాన్యం రవాణా, మోటారు పంపులు, ఇతరత్రా పరికరాలకు డీజిల్‌ అవసరం. పెరిగిన ధరలతో సాగు వ్యయం విపరీతంగా పెరిగి అన్నదాతలకు ఇక్కట్లు తప్పేలా లేదు.

వాహనదారులపై భారం

జిల్లాలో అన్ని రకాల వాహనాలు కలిపి 1,47,786 ఉండగా, 108 పెట్రోల్‌ బంకులు ఉన్నాయి. వాటి లో రోజూ 1.10లక్షల లీటర్ల పెట్రోల్‌ అమ్మకాలు జరుగుతున్నాయి. దీంతో పెట్రోల్‌ వినియోగదారులపై పెరిగిన ధరలతో రోజూ రూ.3.30లక్షల భారం పడుతుండగా, నెలరోజులకు లెక్కగడితే రూ.కోటి వరకు భారం పడుతోంది. అదేడీజిల్‌ వినియోగాని వస్తే రోజుకు రూ.1.72లక్షల లీటర్ల డీజిల్‌ విక్రయాలు జరుగుతున్నాయి. దీనిప్రకారం రోజుకు రూ.5.13లక్షల భారం పడుతుంటే, నెలకు రూ.1,54,80,000 భారం ప్రత్యక్షంగా వాహనదారులపై పడునుంది. పరోక్షంగా జిల్లాలోని రవాణా వ్యయం పెరిగి, మరింత భారం పడనుంది. పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపు, కొరతను అధిగమించేందుకు ఎలక్ట్రికిక్‌ వాహనాల కొనుగోలు, వినియోగం వైపు మొగ్గు చూపాల్సిన అవసరం ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement