పెద్దపల్లి: ధాన్యంలో కోత విధించకుండా అన్‌లోడ్ చేసుకోవాలని పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు రైస్‌మిల్లర్లపై ఒత్తిడి తెస్తున్నారు. తప్ప, తాలు, రాళ్లు కలిసిన వడ్లు తీసుకుంటే తమకు నష్టాలు వస్తున్నాయని మరోవైపు రైస్ మిల్లర్లు చెబుతున్నారు. తప్ప, తాలు, రాళ్లతో కూడిన ధాన్యం తూకం వేశాక లారీలో లోడ్‌చేసి మిల్లుకు తరలిస్తే.. ఒక్కో క్వింటాల్‌పై 8 కిలోల వరకు తరుగు వస్తోందని పేర్కొంటున్నారు. కొందరు కొనుగోలు కేంద్రాల నిర్వాహకుల తీరుతోనే ఈ సమస్య తలెత్తుతోందనే ఆరోపణలు వస్తున్నాయి.
334 కొనుగోలు కేంద్రాలు.. 150 తేమశాతం యంత్రాలు..
జిల్లాలో 334 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. అందులో ధాన్యంలో తేమశాతం నిర్ధారించేందుకు ఆటోమేటిక్ మ్యాచర్ యంత్రాలు 150, మాన్యువల్ యంత్రాలు 350 ఉన్నాయి. ఈ సీజన్‌లో జిల్లాలోని 125 రైస్ మిల్లులకు ధాన్యం కేటాయించారు. ఇప్పటి వరకు 1,78,000 మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేశారు. ఈమొత్తాన్ని రైస్ మిల్లులకు వాహనాల ద్వారా తరలించారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. సుల్తానాబాద్ మండలం కాట్నపల్లిలోని ఓ రైస్‌మిల్లు యజమాని.. ధాన్యంలో తప్ప, తాలు ఉందని, ఇలాంటి వడ్లు తీసుకుంటే తమకు నష్టం వస్తుందని, అందుకే అన్‌లోడ్ చేసుకోబోమని తెగేసి చెప్పారు. రైతులకు ఏం చేయాలో తోచలేదు. ఇది ఆ ఒక్కమిల్లు సమస్యే కాదు.. దాదాపు అన్ని రైస్ మిల్లులదీ ఇదే పరిస్థితి. నిర్దేశిత 17శాతం తేమ వచ్చాకే ధాన్యం తూకం వేయాలని, ఈ నిబంధనేదీ పాటించకుండా వడ్లు తూకం వేయడంతో సమస్య తలెత్తుతోంది. తప్ప, తాలు, రాళ్లు, మట్టిపెళ్లలు లాంటి కల్తీ కలిగిన ధాన్యం మరపట్టిస్తే బియ్యంలో నూకల శాతం అధికంగా ఉంటోందని ఎఫ్‌సీఐ అధికారులు చెబుతున్నారు. ఇట్లాంటి వడ్లు తీసుకునేదిలేదని రిజెక్ట్ చేస్తున్నారు.
మిల్లర్లు ఏం చెబుతున్నారంటే..
నాణ్యతలోనూ సమస్యలు
కొందరితోనే సమస్య
కొందరు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతోనే తప్ప, తాలు, రాళ్లతో కూడిన ధాన్యం వస్తోంది. నిర్దేశిత తేమశాతం వచ్చిన తర్వాతే తూకం వేయాలని ఆదేశాలు జారీ చేశాం. మెజార్టీ కొనుగోలు కేంద్రాల్లో ఈ నిబంధనలు కచ్చితంగా అమలు చేస్తున్నారు. కొందరే అమలు చేయడం లేదు. ఇప్పటివరకు తూకం వేసిన 1.78 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 125 రైస్ మిల్లులకు చేరవేశాం. కొనుగోళ్లను మరింత వేగవంతం చేస్తాం.
– శ్రీకాంత్, డీఎం, సివిల్ సప్లయ్


