కాల్వశ్రీరాంపూర్: పెగడపల్లిలో ఆదివారం పో చమ్మ బోనాలు ప్రారంభమయ్యాయి. ఈనెల 19వ తేదీ వరకు ఉత్సవాలు కొనసాగనున్నా యి. తొలిరోజు అమ్మవారికి చీర, సారె, గాజు లు, రవిక బట్టలు, బెల్లంపానకం, పాయసం, కల్లు, గుడాలు సమర్పించుకున్నారు. మాజీ ఎంపీపీ సారయ్యగౌడ్, సర్పంచ్ ఆరెల్లి రమేశ్, ఉపసర్పంచ్ శ్రీనివాస్‌రెడ్డి, మాజీ సర్పంచ్ సు జాత, గౌడ సంఘం అధ్యక్షుడు వీరగోని సద య్య, నాయకులు గోపగోని రాజయ్య, సమ్మ య్య, శ్రీనివాస్, సదయ్య పాల్గొన్నారు.
ర్యాంకర్‌కు పురస్కారం
సుల్తానాబాద్‌రూరల్: భూపతిపూర్ కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలోని బట్టు సౌ మ్య ఇంటర్‌లో రాష్ట్రస్థాయి ర్యాంక్ సాధించగా ప్రభుత్వ సలహాదారు కేశవరావు, కాలేజీ, టె క్నికల్ ఎడ్యుకేషనల్ కమిషనర్ శ్రీదేవసేన నుంచి రూ.25వేల పురస్కారం లభించింది. హైదరాబాద్ జూబ్లిహిల్స్‌లో విద్యా విజయోత్సవాల్లో భాగంగా శనివారం నగదు అందజేశారు. ఇంటర్‌లో 1000కి 994 మార్కులు సాధించినందుకు అవార్డు అందుకున్నట్లు స్పెషల్ ఆఫిసర్ స్వప్న తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందిస్తున్నామని, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరారు.
సమయపాలన కోసం..
ఓదెల: సమయపాలనతోపాటు వస్తురవాణా మరింత వేగిరం చేసేందుకు రెండు గూడ్సు రైళ్లను అనుసాధినిస్తోంది రైల్వేశాఖ. కాజీపేట – బల్హార్షా మధ్య బొగ్గు, ఇనుము, సిమెంట్ రవాణాను మరింత వేగవంతం చేసేందుకు ఈప్రక్రియ చేపట్టింది. ఈ మార్గంలో మూడో లైన్ ఇప్పటికే పూర్తయ్యింది. ఈ ట్రాక్ ఖాళీగా ఉండకుండా రెండేసి చొప్పున గూడ్సురైళ్లను అనుసంధానించి ఒకేసారి నడిపిస్తోంది. తద్వారా రవాణా మెరుగైంది. రైల్వేశాఖకు ఆదాయం కూడా భారీగానే సమకూరుతోంది. అనుసంధానం ద్వారా రైలు పొడవు పెరిగి లెవల్‌క్రాసింగ్ గేట్ల వద్ద ప్రయాణికులు చాలాసమయం నిరీక్షించాల్సి వస్తోంది.
ఈత పోటీల్లో ప్రతిభ
జ్యోతినగర్: రాష్ట్రస్థా యి స్విమ్మింగ్ పోటీ ల్లో ఎన్టీపీసీ కేంద్రీ య విద్యాలయానికి చెందిన నడిపల్లి ప్రే సికరావు బ్రేస్ట్‌స్ట్రోక్‌లో ద్వితీయ, ఫ్రీస్టైల్‌లో నాలుగో స్థానం సాధించినట్లు కోచ్ శ్రీనివాస్ తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించిన పోటీలకు ప్రేసికరావు అండర్–10 లో పాల్గొందన్నారు. ఆమె తండ్రి పోలీస్ కానిస్టేబుల్ నడిపల్లి కల్యాణ్‌రావు.
ముగిసిన జేఈఈ అడ్వాన్స్‌డ్
రామగిరి: పన్నూర్‌లోని మంథని జేఎన్టీయూలో జేఈఈ అడ్వాన్స్‌డ్ ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. ఉదయంపూట 96 మంది విద్యార్థులకు 95 మంది, మధ్యాహ్నం 96 మందికి 94 మంది హాజరయ్యారని ప్రిన్సిపాల్ విష్ణువర్ధన్ తెలిపారు. ఐఐటీ హైదారాబాద్‌కు చెందిన ముగ్గురు పరిశీలకులు పర్యవేక్షించారు. మంథని సీఐ రాజుగౌడ్, రామగిరి ఎస్సై శ్రీనివాస్ బందోబస్తు చేపట్టారు.
హెచ్‌ఎంకు సన్మానం
కాల్వశ్రీరాంపూర్: జిల్లాలోని ప్రభుత్వ స్కూళ్లలో ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టం అమలు చేయడంలో అగ్రస్థానంలో నిలిచిన ఊశన్నపల్లె హెచ్‌ఎం ఈర్ల సమ్మయ్యను ప్రభుత్వ విప్ విజయరమణారావు, కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదివారం శాలువా కప్పి సన్మానించారు. ఎఫ్‌ఆర్‌ఎస్‌లో విద్యార్థుల హాజరు శాతం పెంచడంలో జిల్లాలోనే ప్రథమ స్థానంలో నిలపడంతో సమ్మయ్యను అభినందించారు. ఈ కార్యక్రమంలో డీఈవో శారద, ఎంఈవో మహేశ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.


