ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన ఫలితాలు | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన ఫలితాలు

May 18 2026 9:43 AM | Updated on May 18 2026 9:43 AM

పెద్దపల్లి: ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్‌ స్కూళ్లకు దీటుగా ఫలితాలు రావడం శుభ పరిణామని ప్రభుత్వ విప్‌ విజయరమణారావు అన్నారు. కలెక్టరేట్‌లో ఆదివారం నిర్వహించిన విద్యావారోత్సవంల్లో కలెక్టర్‌ కోయ శ్రీహర్షతో కలిసి విప్‌ మాట్లాడారు. పెద్దపల్లి పట్టణ పరిధిలోని పదోతరగతి ఫలితాల్లో ప్రభుత్వ విద్యా సంస్థల్లోని 98 మంది విద్యార్థులు 550కుపైగా మార్కులు సాధించడం గర్వకారణమన్నారు. మరోఐదు గ్రామీణ మండలాల్లో 138 మందికిపైగా విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించారని విజయరమణారావు తెలిపారు. వీరందరిని త్వరలో సన్మానిస్తామని చెప్పారు. అ నంతరం 10వ తరగతి, ఇంటర్‌లో అధిక మార్కు లు సాధించిన 11 మంది విద్యార్థులను సన్మానించారు. ఒక్కొక్కరికి రూ.10 వేల విలువైన చెక్కులు పంపిణీ చేశారు. డీఈవో శారద, ఇంటర్‌ విద్య జిల్లా నోడల్‌ ఆఫీసర్‌ కల్పన పాల్గొన్నారు.

‘చేనేత’ రుణమాఫీ ఘనత కాంగ్రెస్‌దే..

చేనేత సంఘాలకు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్‌ ప్రభుత్వానికే దక్కిందని విప్‌ విజయరమణారావు అన్నారు. పద్మశాలీ సర్పంచులు, వార్డు సభ్యులు, ఉప సర్పంచ్‌లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, చైర్‌పర్సన్లకు ఆదివారం జిల్లా కేంద్రంలోని ఆర్‌ఆర్‌ గార్డెన్‌లో ఆత్మీయ సన్మానం చేశారు. విప్‌ మాట్లాడుతూ, పద్మశాలీల కులవృత్తిని బతికించుకోవాలనే సంకల్పంతో ప్రభుత్వం రూ.30 కోట్ల వ్యక్తిగత రుణాలు మాఫీ చేసిందని గుర్తుచేశారు. హ్యాండ్లూమ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ చైర్మన్‌ దూడం వెంకటరమణ, పద్మశాలీ సహకార కార్పొరేషన్‌ చైర్మన్‌ గూడూరు శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో పద్మశాలీల సమస్యలను సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దృష్టికి తీసుకెళ్తామని అభయం ఇచ్చారు. పెద్దపల్లిలో పద్మశాలీ భవన నిర్మాణానికి స్థలం కేటాయించేందుకు చర్య లు తీసుకుంటామని అన్నారు. సంఘం జిల్లా అధ్యక్షుడు వేముల రాంమ్మూర్తి అధ్యక్షతన జరిగిన ఆత్మీ య సమ్మేళనంలో మంథని మున్సిపల్‌ చైర్మన్‌ ఒడ్నాల శ్రీనివాస్‌, ఓదెల దేవస్థానం చైర్మన్‌ చీకట్ల మొండయ్య, పద్మశాలీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వల్లకట్ల రాజ్‌కుమార్‌, ఉపాధ్యక్షుడు వేముల బాలరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఐల రమేశ్‌, ఉపాధ్యక్షుడు సాయిరి మహేందర్‌, మాజీ జెడ్పీటీసీ బొద్దుల లక్ష్మణ్‌, నాయకులు మెరుగు యాదగిరి, స్వతంత్ర కుమార్‌, కొలిపాక సత్తయ్య పాల్గొన్నారు.

ప్రభుత్వ విప్‌ విజరమణారావు, కలెక్టర్‌ కోయ శ్రీహర్ష

Advertisement
 
Advertisement
Advertisement