డీఎన్‌ఏ టెస్ట్‌కు సిద్ధం | - | Sakshi
Sakshi News home page

డీఎన్‌ఏ టెస్ట్‌కు సిద్ధం

May 18 2026 9:43 AM | Updated on May 18 2026 9:43 AM

సింగరేణి మారుపేరు కార్మికుల వారసులు

గోదావరిఖని: వారసులుగా నిరూపించుకునేందుకు తాము డీఎన్‌ఏ టెస్ట్‌కై నా సిద్ధమేనని సింగరేణి విజిలెన్స్‌, మారుపేరు కార్మికుల డిపెండెంట్లు స్పష్టం చేశారు. సింగరేణి మారుపేరు, విజిలెన్స్‌ పెండింగ్‌ కేసుల బాధితుల ఐక్యవేదిక సమావేశం స్థానిక ప్రె స్‌క్లబ్‌లో ఆదివారం నిర్వహించారు. బాధితులు మాట్లాడుతూ, దేశానికి వెలుగులు అందిస్తున్న కార్మికుల పిల్లలకు అన్యాయం జరుగుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. సింగరేణి తెలంగాణకు గుండెకాయ అని అన్నిపార్టీల నాయకులు చెబుతున్నా.. వారి వారసుల సమస్యలు విస్మరిస్తున్నారని విమర్శించారు. హక్కుల సాధనకు తొలిదశలో అన్ని ఏరియాల్లోని ఎమ్మెల్యేలను కలిసి వినతిపత్రాలు అందజేస్తామని ప్రకటించారు. వివిధ యూనియన్ల నేతలు వైవీరావు, మడ్డి ఎల్లాగౌడ్‌, మాదాసి రాంమూర్తి, క్రాంతికుమార్‌, కృష్ణ, కుమారస్వామి, పోచమల్లుతోపాటు కోల్‌బెల్ట్‌లోని 12 ఏరియాలకు చెందిన డిపెండెంట్లు హాజరయ్యారు. నాయకుడు లక్క శ్రావణ్‌గౌడ్‌ అధ్యక్షత వహించారు.

Advertisement
 
Advertisement
Advertisement