నాతో పాటు నా దగ్గర పనిచేసే మరోఇద్దరు కలిసి కిరాణా, జనరల్ స్టోర్స్‌కు పలు రకాల వస్తువులను మార్కెటింగ్ చేస్తున్నాం. ట్రాలీ ఆటోలతోపాటు బైక్‌పై రోజూ గోదావరిఖని, రామగుండం, యైటింక్లయిన్ కాలనీ తదితర ప్రాంతాల్లో మార్కెటింగ్ చేయడానికి తిరుగుతున్నాం. ఇప్పుడు పెట్రోల్, డీజల్‌పై రూ.3 చొప్పున ధరలు పెంచారు. మరో రూ.10 కూడా పెంచే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ ధరలను చూస్తుంటే బతుకుడు ఎలాగనే ఆందోళనగా ఉంది. పెరిగిన ఇంధనం ధరలతో రోజుకు అదనంగా రూ.వెయ్యి ఆర్థిక భారం పడే అవకాశం కనిపిస్తోంది. అసలే మార్కెటింగ్‌లో ఆశించిన స్థాయిలో లాభాలు లేవు. దీనికితోడు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం ద్వారా మాలాంటి వారు ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుంది.
– శ్రీనివాస్, శ్రీరామ ఏజెన్సీస్, గోదావరిఖని


