పెద్దపల్లి: పెద్దకల్వ ల గ్రామానికి చెందిన ఎరవేన అజ య్ వరల్డ్ అథ్లెటి క్స్ కోచింగ్ కోర్స్ లెవల్–1 పరీక్షలో ఉత్తీర్ణత సాధించి, లెవల్–2 కోర్స్‌కు అర్హత పొందారు. కలెక్టర్ కోయ శ్రీహర్ష శనివారం అజయ్‌ను అభినందించారు. అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈఏడాది ఏప్రిల్ 1 నుంచి 6వ తే దీ వరకు బెంగళూరులో నిర్వహించిన పరీక్షలు అజయ్ ఉత్తీర్ణత సాధించడం ద్వారా శిక్షణకు ఎంపికయ్యారు. అజయ్ మాట్లాడుతూ, జిల్లా నుంచి జాతీయ, అంతర్జాతీయ స్థాయి అథ్లెట్లను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో వరల్డ్ అథ్లెటిక్స్ కోచింగ్ కోర్స్ పూర్తిచేసినట్లు తెలిపారు.
పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి
యైటింక్లయిన్‌కాలనీ: నగర పరిశుభ్రతను కా పాడేందుకు అందరూ సహకరించాలని బల్ది యా కమిషనర్ అరుణశ్రీ కోరారు. 15వ డివిజన్‌లోని వెంకట్రావుపల్లి కేకేనగర్ ఏరియాలో కార్పొరేటర్ బుర్ర శశికళ– ముత్యాలుగౌడ్‌తో కలిసి శనివారం పర్యటించారు. డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి, శానిటరీ ఇన్‌స్పెక్టర్ సంపత్, సూపర్‌వైజర్ సారయ్య, వార్డు ఆఫీసర్ అరుణ్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
నిర్వాసితులతో సమావేశం
రామగుండం: కుందనపల్లి రైల్వేగేట్ వద్ద వంతెన నిర్మాణంపై పెద్దపల్లి ఆర్డీవో గంగయ్య ని ర్వాసితులతో శనివారం సమావేశమయ్యారు. తొలుత వారితో కలిసి వంతెన ప్రతిపాదిత స్థ లం పరిశీలించారు. రైల్వే వంతెన నిర్మాణానికి రైల్వేశాఖ రూ.110 కోట్లు కేటాయించిందని అ ధికారులు తెలిపారు. సర్పంచ్ అర్కుటి కొమురయ్యయాదవ్, కార్యదర్శి లక్ష్మి పాల్గొన్నారు.
వ్యాధులను దూరం చేద్దాం
పెద్దపల్లి: ప్రజల భాగస్వామ్యంతో అంటువ్యాధులు దూరం చేయవచ్చని జిల్లా వైద్యాధికారి ప్రమోద్ కుమార్ అన్నారు. శనివారం జాతీయ డెంగీ దినోత్సవ సందర్భంగా జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ, వర్షాకాలంలో నీటినిల్వలు లేకుండా చూసు కుంటే వ్యాధులు రావన్నారు. డాక్టర్ శ్రీరాము లు, ప్రోగ్రాం అధికారులు విసుధాకర్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, డీపీఎంలు రమేశ్, రాజేశం ఉన్నారు.
రాష్ట్ర కమిటీలో చోటు
పెద్దపల్లి/రామగుండం: బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా కందుల సంధ్యారాణి నియమితులయ్యారు. 2006లో ఎంపీటీసీగా గెలుపొందిన ఆమె.. 2008–14 వరకు ఉమ్మడి రామగుండం మండల అధ్యక్షురాలిగా సేవలందించారు. 2014–19, 2019–23 వరకు రెండు పర్యాయాలు పాలకుర్తి జెడ్పీటీసీగా కొనసాగా రు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. సంధ్యారాణిని సుల్తానాబాద్‌లో శనివారం బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. బీజేపీ మండల అధ్యక్షుడు కందుల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శులు కొల్లూరి సంతోష్ కుమార్, కోట నాగేశ్వర్, అశోక్‌గౌడ్ ఉన్నారు.
ప్రహరీ కూల్చివేత
పెద్దపల్లిరూరల్: కూనారం రోడ్డులో అనుమతిలేకుండా విద్యుత్ హైటెన్షన్ తీగల కింద నిర్మించిన ఇంటి ప్రహరీని మున్సిపల్ అధికారులు శనివారం కూల్చివేశారు. ‘ఇదేనా విద్యుత్ భద్ర త’ శీర్షికన ‘సాక్షి’లో శనివారం ప్రచురితమైన క థనానికి మున్సిపల్ అధికారులు స్పందించా రు. హైటెన్షన్ విద్యుత్ తీగల కింద ప్రమాదకరంగా ఉందని గుర్తించి జేసీబీ సాయంతో ప్ర హరీ కూల్చివేశారు. అనుమతి లేకుండానే ఇంటిని నిర్మించారని మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్ తెలిపారు. ప్రమాదకరంగా నిర్మించిన కట్టడాన్ని తొలగిస్తామని ఆయన పేర్కొన్నారు.


