మద్దతు ధరతోనే కొనుగోలు | - | Sakshi
Sakshi News home page

మద్దతు ధరతోనే కొనుగోలు

May 17 2026 7:32 AM | Updated on May 17 2026 7:32 AM

● ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే విజయరమణారావు

పెద్దపల్లిరూరల్‌: ధాన్యం, మొక్కజొన్నలను మద్ద తు ధరతోనే కొనుగోలు చేస్తుందని ప్రభుత్వ విప్‌ విజయరమణారావు అన్నారు. స్థానిక వ్యవసాయ మార్కెట్‌లో శనివారం ఆయన పర్యటించారు. రైతు ల సమస్యలపై ఆరా తీశారు. ఏఎంసీ చైర్మన్‌ కూర మల్లారెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ మల్లయ్య, కౌన్సిలర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఆలయంలో ప్రత్యేక పూజలు

పెద్దపల్లిరూరల్‌/పెద్దపల్లి: చీకురాయిరోడ్డులోని పు రాతన శ్రీహనుమాన్‌ ఆలయంలో శనివారం శనిజయంతి కావడంతో అర్చకులు రమేశ్‌ ఆధ్వర్యంలో విజయరమణారావు ప్రత్యేక పూజలు చేశారు. కౌ న్సిలర్లు పూదరి మహేందర్‌, నాయకులు అమిరిశె ట్టి తిరుపతి, క్రాంతికుమార్‌, సంతోష్‌ ఉన్నారు. అ మావాస్య సందర్భంగా గాయత్రీసేవా సమితి ఆధ్వర్యంలో జెండా కూడలిలో అన్నదానం ప్రారంభించారు. వ్యవస్థాపకుడు కాసనగొట్టు వినయ్‌ను విప్‌ అభినందించారు. ఆర్యవైశ్యులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement