సిబ్బంది భద్రతకు ప్రాధాన్యం | - | Sakshi
Sakshi News home page

సిబ్బంది భద్రతకు ప్రాధాన్యం

May 17 2026 7:32 AM | Updated on May 17 2026 7:32 AM

పెద్దపల్లిరూరల్‌: విద్యుత్‌ సిబ్బంది భద్రతకు వన్‌ మినిట్‌ రూల్‌ పేరిట ప్రత్యేక భద్రత విధానం అ మలు చేస్తున్నట్లు ఎన్పీడీసీఎల్‌ ఎస్‌ఈ గంగాధర్‌ అ న్నారు. క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బంది తాము పనిప్రారంభించే ముందు ఒక్కనిమిషం పాటు భద్రత ప్రమాణాలను సమగ్రంగా పరిశీలించడమే దీని ప్రధాన ఉద్దేశమన్నారు. ప్రతీఒక్కరు బాధ్యతగా పాటించి ప్రమాదాలను నియంత్రించాలనే సంస్థ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి సరికొత్త ఆలోచనతో కొత్త విధానం అమల్లోకి తెచ్చారని పేర్కొన్నారు.

20న మెడికల్‌ షాపుల బంద్‌

కోల్‌సిటీ(రామగుండం): అఖిల భారత కెమిస్ట్‌, డ్ర గ్గిస్ట్‌ సంఘం(ఏఐవోసీడీ) పిలుపు మేరకు ఈనెల 20న మెడికల్‌ షాపుల బంద్‌ పాటిస్తున్నామని గో దావరిఖని కెమిస్ట్‌ అండ్‌ డ్రగ్గిస్ట్‌ అసోసియేషన్‌ ప్ర కటించింది. శనివారం గోదావరిఖని లక్ష్మీనగర్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బంద్‌ పిలుపు ప్రచా ర పోస్టర్‌ ఆవిస్కరించారు. అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు ఎం.వినోద్‌ కుమార్‌, ప్రధాన కార్యదర్శి కె.రాజేందర్‌, కోశాధికారి పోలు సతీశ్‌ మాట్లాడు తూ.. దేశవ్యాప్తంగా సుమారు 12.40 లక్షల మెడిక ల్‌ షాపులు, ఫార్మసీలు, కెమిస్ట్‌ దుకాణాలు బంద్‌ లో పాల్గొంటాయన్నారు. పట్టణ కోశాధికారి పిట్టల శ్రీనివాస్‌, సభ్యులు ఎన్‌.కరుణాకర్‌రెడ్డి, విష్ణుమూర్తి, కోటగిరి వాసు, సంతోష్‌, అశోక్‌, మార్గాచారి, రాజేందర్‌, సత్యనారాయణ, శ్రీధర్‌ పాల్గొన్నారు.

నేడు ఆత్మీయ సమ్మేళనం

పెద్దపల్లి: రంగంపల్లి ఆర్‌ఆర్‌ గార్డెన్‌లో ఆదివారం చేపట్టిన పద్మశాలీ ఆత్మీయ సమ్మేళనం విజయవంతం చేయాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు వేముల రామమూర్తి కోరారు. సుల్తానాబాద్‌లో శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందిన వార్డు మెంబర్లు, సర్పంచులు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, మున్సిపల్‌ చైర్‌పర్సన్లు, వైస్‌ చైర్మన్‌లను ఈ సందర్భంగా సన్మానిస్తామని తెలిపారు. ఓదెల శ్రీమల్లికార్జునస్వామి దేవస్థానం చైర్మన్‌ చీకట్ల మొండయ్య, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ మహేందర్‌, మాజీ సర్పంచ్‌ మురళి, నాయకులు సామల హరికృష్ణ, మేరుగు యాదగిరి, బత్తుల రమేశ్‌, అడిచర్ల స్వతంత్ర కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

సర్కారు బడుల్లో చేర్పించాలి

పెద్దపల్లి: పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించా లని డీఈవో శారద అన్నారు. స్థానిక బాలుర ఉన్న త పాఠశాలలో వారం రోజులుగా సాగుతున్న సమ్మ ర్‌ క్యాంప్‌ ముగింపు సమావేశం శనివారం జరిగింది. డీఈవో హాజరై మాటాడారు. జిల్లా అకడమిక్‌ మానటరింగ్‌ అధికారి పీఎం షేక్‌, ఎంఈవో సురేందర్‌కుమార్‌, టీ ఫైబర్‌ మేనేజర్‌ శ్రీరామ్‌ రాహుల్‌, సీఆర్పీలు బాలసాని వెంకటేశం, సుందరగిరి శ్రీనివాస్‌, కుంబాల సుధాకర్‌, యూసుఫ్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement