ధర్మారం/జూలపల్లి: మొక్కజొన్న, ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. జూలపల్లిలో మొక్కజొన్న, వడ్కాపూర్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను శనివారం ఆయన తనిఖీ చేశారు. ధర్మారంలోని మక్కల కొనుగోళ్లపై ఆరా తీశారు. ఆయా కార్యక్రమాల్లో కలెక్టర్ మాట్లాడుతూ, కొనుగోలు చేసిన వెంటనే రైస్‌మిల్లులకు తరలించేందుకు లారీలతోపాటు ట్రాక్టర్లను వినియోగించుకోవాలని సూచించారు. జూలపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొమ్మ పోచాలు, తహసీల్దారు దత్తుప్రసాద్, అధికారులు ఉన్నారు.


