పెద్దపల్లిరూరల్: పెద్దకల్వల శివాలయంలో బు ధవారం హోమం, యాగం ఘనంగా నిర్వహించారు. మూడు రోజులుగా శ్రీకాంతేశ్వరస్వామి ఆధ్వర్యంలో లక్ష్మీనర్సింహస్వామి, భాస్కరా చారి పూజాకార్యక్రమాల్లో పాలుపంచుకున్నా రు. ఈప్రాంత ప్రజలు సుభిక్షంగా ఉండాలని హోమం, యాగయజ్ఞాలను నిర్వహించినట్టు సర్పంచ్ నర్లకనకమ్మ, పోల్‌రాజ్ తెలిపారు.
ఆకుల భూమయ్య జయంతి
జూలపల్లి: కాచాపూర్ నివాసి, తెలంగాణ జనసభ వ్యవస్థాపక అధ్యక్షుడు ఆకుల భూమయ్య జయంతిని బుధవారం ఘనంగా నిర్వహించా రు. గ్రామంలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. సర్పంచ్ పెంట కావేరి – కిశోర్, ఉపసర్పంచ్ దాడి మనోహర్, మాజీ సర్పంచ్ ఆకుల రాజయ్య, వార్డు సభ్యులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
‘ఉపాధి’ కల్పించండి
మంథనిరూరల్: సింగరేణి ప్రభావిత మంథని మండలం చిల్లపల్లి, దుబ్బపల్లిలోని పేద కు టుంబాలకు ఉపాధిహామీ పనులు లభించడం లేదని, ప్రత్యామ్నాయంగా సింగరేణి ప్లాంటేషన్‌లో ఉపాధి అవకాశాలు కల్పించాలని దుబ్బపల్లి సర్పంచ్ ఎరవెల్లి కృష్ణవేణి – నరేశ్‌రావు, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కుడుదుల రవి కోరారు. ఈమేరకు సింగరేణి ఆర్జీ –1 జీఎం లలిత్‌కుమార్‌ను బుధవారం కలిశారు. గ్రామ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. శాలువాతో సన్మానించారు. ప్లాస్టిక్ నిర్మూలన కోసం పంచాయతీకి స్టీల్‌ప్లేట్లు, గ్లాసులు అందజేయాలని, నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేలా వృత్తి విద్య శిక్షణ(వీటీసీ) ఇ ప్పించాలని, మినీఫంక్షన్‌హాల్ నిర్మాణానికి ని ధులు మంజూరు చేయాలని కోరారు. సమస్యలపై జీఎం సానుకూలంగా స్పందించారు.
క్రీడల్లోనూ రాణించాలి
రామగిరి: విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో నూ ప్రతిభ చూపాలని మంథని జేఎన్టీయూ ప్రిన్సిపాల్ విస్ణువర్ధన్ అన్నారు. హుజూరాబాద్‌లో ఇటీవల నిర్వహించిన రాష్ట్రస్థాయి క్రీడాపోటీల్లో మంథని జేఎన్టీయూ విద్యార్థులు బ హుమతులు సాధించారు. వారిని కళాశాలలో బుధవారం అభినందన కార్యక్రమం నిర్వహించారు. బాలుర బాడ్మింటన్ డబుల్స్‌లో బి.సాయిదీప్, సీహెచ్ వంశీ ప్రథమ, బాలికల బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో ఎం.మైత్రి ప్రథమ, బాలికల క్యారమ్ సింగిల్స్‌లో పి.అలేఖ్య ద్వితీ య బహుమతులు సాధించగా ప్రశంసాపత్రా లు అందజేశారు. పరిపాలన అధికారి సుమన్‌రెడ్డి, ఫిజికల్ డైరెక్టర్లు కృష్ణారెడ్డి, సునీల్‌కుమార్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
పౌష్టికాహారంతో తల్లీబిడ్డలు క్షేమం
పెద్దపల్లి: పౌష్టికాహారంతో తల్లీబిడ్డలు క్షేమంగా ఉంటారని జిల్లా వైద్యాధికారి ప్రమోద్‌కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి లో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గర్భిణులు ప్రసవ సమ యం వరకు కనీసం నాలుగుసార్లు వైద్యపరీక్ష లు చేయించుకోవాలని సూచించారు. డిప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీరాములు, ప్రోగ్రాం అధికారి వాణిశ్రీ, ఆర్‌ఎంవో విజయ్, పిల్లల వైద్యుడు రవీందర్, జమున తదితరులు పాల్గొన్నారు.
లింగనిర్ధారణ నేరం
లింగనిర్ధారణ చట్ట వ్యతిరేకమని డాక్టర్ ప్రమోద్‌కుమార్ అన్నారు. కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో జరిగిన అడ్వైజరీ కమిటీ సమావేశంలో ఆ యన మాట్లాడారు. జిల్లాలో రిజిస్ట్రేషన్ స్కా నింగ్ సెంటర్లు 33 ఉన్నాయని, ప్రతీనెల వాటి ని తనిఖీ చేయాలన్నారు. డాక్టర్‌లు వాణిశ్రీ, శ్రీ రాములు, కిరణ్, అనూషరెడ్డి, రెడ్‌క్రాస్ సొసై టీ అధ్యక్షుడు రాజగోపాల్ పాల్గొన్నారు.


