పూరీ.. వర్రీ | - | Sakshi
Sakshi News home page

పూరీ.. వర్రీ

Mar 23 2026 9:14 AM | Updated on Mar 23 2026 9:14 AM

పెద్దపల్లిరూరల్‌: గ్యాస్‌ సిలిండర్ల సరఫరాలో తలెత్తి న అంతరాయం జిల్లాపై తీవ్రప్రభావం చూపుతోంది. ప్రధానంగా హోటళ్లు, టిఫిన్‌ సెంటర్ల నిర్వాహకులను ముప్పుతిప్పలు పెడుతోంది. అమెరికా, ఇ జ్రాయిల్‌, ఇరాన్‌ మధ్య నెలకొన్న యుద్ధం నేపథ్యంలో గ్యాస్‌ సరఫరాలో జాప్యం జరుగుతోంది. వాణిజ్య అవసరాలకు వినియోగించే సిలిండర్ల సరఫరా అంతంతమాత్రంగానే ఉంది. హోటళ్లు, రెస్టారెంట్లు, టిఫిన్‌ సెంటర్ల నిర్వాహకులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. గ్యాస్‌ కొరతతో తా ము వ్యాపారం నిర్వహించలేమని కొందరు టిఫిన్‌ సెంటర్లు, హోటళ్లను మూసేస్తున్నారు. ఇంకొందరు కేవలం టిఫిన్‌లు మాత్రమే.. అదికూడా ఉదయం పూటనే తయారు చేస్తున్నారు. సాయంకాల వ్యాపారమైన బజ్జీ, మిర్చీ, గారెలు వేయడం మానేశారు.

మూసివేత బాటలో కర్రీ పాయింట్లు..

ఉద్యోగులు, విద్యార్థులు, బ్యాచిలర్లు తమ గదుల్లో అన్నం వండుకుని కూరలను కర్రీపాయింట్లలో కొనుక్కునే వారు. గ్యాస్‌ కొరతతో కర్రీ పాయింట్లు మూతపడుతున్నాయి. దీంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మార్కెట్‌లో కూరగాయలు, ఆకుకూరల ధరలు తక్కువ ధరలకే లభ్యమవుతున్నా.. వాటిని వండేందుకు ఉపయోగించే గ్యాస్‌ సిలిండర్ల సరఫరా లేక తాము ఉపాధి కోల్పోవాల్సి వస్తోందని పలువురు సిబ్బంది వాపోతున్నారు.

ధరలు పెంచేశారు

టిఫిన్‌లు, భోజనం, చపాతీ, ఫాస్ట్‌ఫుడ్‌ ఇలా.. రకరకాల ఆహార పదార్థాల తయారీకి అవసరమైన గ్యా స్‌ ధర పెరగడం, సకాలంలో దొరక్క పోవడంతో సగం వరకు హోటళ్లు మూతపడ్డాయి. అరకొరగా నడిపే హోటల్‌, బేకరీ తదితర ఆహారపదార్ధాల త యారీ, విక్రయదారులు వాటిధరలను కొంత పెంచేశారు. టిఫిన్‌ సెంటర్లలో ఇదివరకు ఉన్న ధరలపై రూ.5 నుంచి రూ.10 వరకు పెంచి అమ్ముతున్నా రు. ధర పెంచినా టిఫిన్‌ దొరుకుందని తెలిసిన వా రు ఆ హోటల్‌కు వెళ్లి ఉన్నది తినేసి వస్తున్నారు. గ్యాస్‌ సిలిండర్ల కొరత తీరి ఎప్పుడు సరఫరా మెరుగవుతుందో.. ఏమోనని, ఇప్పటి పరిస్థితులు ఐదా రేళ్ల కిందటి కరోనా పరిస్థితులను గుర్తు చేస్తున్నా యని పలువురు యజమానులు పేర్కొంటున్నారు.

రెస్టారెంట్లు

మెస్‌లు

టిఫిన్‌

సెంటర్లు

బేకరీలు

స్వీట్‌హౌస్‌లు

ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు

ఇడ్లీ.. ధర పెరిగి – దోశ ఊరించి..

జిల్లాలో తీవ్రమైన వంటగ్యాస్‌ కొరత

మూతపడుతున్న హోటళ్లు, టిఫిన్‌ సెంటర్లు

కొన్నింటిని తెరుస్తున్నా పెరిగిన ధరలు

రెస్టారెంట్లు, బేకరీలు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు, తోపుడుబండ్లపై టిఫిన్‌ తయారు చేసేవాళ్లూ ఇవే వంటగ్యాస్‌ కష్టాలు ఎదుర్కొంటున్నారు. మరోవైపు.. కొందరు నిర్వాహకులు ప్లేట్‌పై రూ.5 ధర పెంచి విక్రయిస్తున్నారు.

పెద్దపల్లిలో హోటళ్లు

‘రోజూ పొద్దున్నే పూరీ, దోశ, ఇడ్లీ, వడ, ఊతప్ప ఇలా.. రకరకాల టిఫిన్లను తయారు చేసేటోళ్లం. కొద్దిరోజులుగా వంటగ్యాస్‌ దొరకడం కష్టంగా మారింది. దీంతోనే హోటల్‌ను మూసివేశాం’ అని జిల్లా కేంద్రంలోని కూనారం రోడ్డు టిఫిన్‌ సెంటర్‌ నిర్వాహకుడు రమేశ్‌ ఆవేదన చెందారు.

ఒక్కపూటే నడుపుతున్నం

రోజూ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు టిఫిన్లు, సాయంత్రం బజ్జీ, మిర్చీ చేసోటోళ్లం. గ్యాస్‌ సిలిండర్ల కొరతతో ఉదయం టిఫిన్‌ చేసి 11 గంటల వరకు టిఫిన్‌ సెంటర్‌ మూసేస్తున్నం. గ్యాస్‌ సిలిండర్‌ ధర పెంచడంతో టిఫిన్లపై రూ.5 పెంచి అమ్ముతున్నం.

– కుర్రె లింగయ్య, టిఫిన్‌ సెంటర్‌ యజమాని, పెద్దపల్లి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement