సింగరేణిలో ఉద్యోగావకాశాలు | - | Sakshi
Sakshi News home page

సింగరేణిలో ఉద్యోగావకాశాలు

Mar 23 2026 9:14 AM | Updated on Mar 23 2026 9:14 AM

గోదావరిఖని: సింగరేణిలోని అంతర్గత ఉద్యోగాల భర్తీకి యాజమాన్యం నిర్ణయించింది. ఈమేరకు పర్సనల్‌ మేనేజ్‌మెంట్‌ విభాగం అన్ని ఏరియాలకు ఉత్తర్వులు జారీచేసింది. ఆసక్తి, అర్హతగల ఉద్యోగులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. టెక్నికల్‌ విభాగంలో సర్వేయర్‌, డ్రిల్లర్‌, సీనియర్‌ కెమిస్ట్‌, చీఫ్‌ టెక్నీషన్‌ రేడియాలజీ, చీఫ్‌ టెక్నీషియన్‌ పాథలజీ, చీఫ్‌ ఫార్మసిస్ట్‌, మేట్రన్‌ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. కనీసం నాలుగు నుంచి ఆరేళ్ల అనుభవం ఉన్నవారు అర్హులని పేర్కొంది. నాన్‌ టెక్నికల్‌లో ఆఫీస్‌ సూపరింటెండెంట్‌, పర్సనల్‌ అసిస్టెంట్‌, లా అసిస్టెంట్‌, జూనియర్‌ అకౌంటెంట్‌ పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులు ఈనెల 23 వరకు ఆయా డిపార్ట్‌మెంట్‌ లేదా జీఎం కార్యాలయాల్లో దరఖాస్తులు సమర్పించాలని సూచించింది. ఈనెల 26లోగా కార్పొరేట్‌ కార్యాలయానికి వాటిని అందజేయాలని కోరింది. సీనియార్టీ, మెరిట్‌ ప్రతిపాదికన ఉద్యోగులను ఎంపిక చేయనున్నట్లు వెల్లడించింది. మస్టర్లకు 5మార్కులు, టెక్నికల్‌, నాన్‌టెక్నికల్‌ ఉద్యోగులకు సీనియార్టీకి మూడు నుంచి ఐదు మార్కులు కేటాయిస్తారు.

పోస్టు ఖాళీలు

జూనియర్‌ అకౌంటెంట్‌ 07

ఆఫీస్‌ సూపరింటెండెంట్‌ 02

పర్సనల్‌ అసిస్టెంట్‌ 02

లా అసిస్టెంట్‌ 02

డ్రిల్లర్‌ 01

సర్వేయర్‌ 02

చీఫ్‌టెక్నీషియన్‌(రేడియాలజీ) 01

చీఫ్‌టెక్నీషియన్‌(పాథలజీ) 01

మేట్రిన్‌ 01

సీనియర్‌ కెమిస్ట్‌ 02

చీఫ్‌ ఫార్మసిస్ట్‌ 01

అంతర్గతంగానే నియామకాలు

సింగరేణి కార్మికులకే అవకాశం

23 వరకు దరఖాస్తుల స్వీకరణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement