పెద్దమ్మ పట్నాలకు మంత్రి హాజరు | - | Sakshi
Sakshi News home page

పెద్దమ్మ పట్నాలకు మంత్రి హాజరు

Mar 23 2026 9:14 AM | Updated on Mar 23 2026 9:14 AM

ధర్మారం: కొత్తూరులో ఆదివారం నిర్వహించి న పెద్దమ్మతల్లి పట్నాలకు మంత్రి లక్ష్మణ్‌కుమార్‌ హాజరయ్యారు. సర్పంచ్‌ భూక్య సంగీత ఆధ్వర్యంలో గ్రామస్తులు ఆయనకు స్వాగతం పలికారు. భక్తుల విన్నపం మేరకు పెద్దమ్మ మండప నిర్మాణానికి రూ.15 లక్షలుల మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. కాంగ్రెస్‌ జిల్లా కార్యదర్శి కొత్త నర్సింహం, యువజన కాంగ్రెస్‌ నియోజకవర్గ అధ్యక్షుడు అసోద అజయ్‌, శ్రీలక్ష్మీనర్సింహస్వామి ఆలయ కమి టీ చైర్మన్‌ సంతోష్‌, మాజీ సర్పంచ్‌ మల్లేశం, నాయకులు చింతల ప్రదీప్‌రెడ్డి, కాల్వ మల్ల య్య, ఎదుల్ల అంజయ్య పాల్గొన్నారు.

ఘనంగా గంగౌర్‌ సింజార

పెద్దపల్లిరూరల్‌: జిల్లా కేంద్రంలోని రాజస్తానీ మహిళా మండలి ఆధ్వర్యంలో ఆదివారం గంగౌర్‌ సింజార ప్రదర్శన ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎల్లమ్మ చెరువు సమీపంలోని హనుమాన్‌ ఆలయంలో వారం రోజులుగా ని త్యం గౌరీదేవి వ్రతం నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయం నుంచి దేవతామూర్తులతో పట్టణంలో ప్రదర్శన నిర్వహించి మళ్లీ ఆలయానికి చేరుకున్నారు. సంప్రదాయం ప్రకారం జొన్నలు ఇతర పూజాసామమాగ్రిని మరుసటిరోజు ప్రవహించే నీటిలో నిమజ్జనం చేస్తారని మండలి సభ్యులు తెలిపారు.

సర్వేయర్ల జిల్లా కార్యవర్గం

పెద్దపల్లి: లైసెన్స్‌డ్‌ సర్వేయర్ల అసోసియేషన్‌ జిల్లా కార్యవర్గాన్ని ఆదివారం ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా సాతూరు అనిల్‌ ఏకగ్రీవమయ్యారు. జిల్లా కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో అసోసియేషన్‌ నూతన కార్యవర్గం ఎన్నికైంది. అసోసియేషన్‌ జిల్లా ఉపాధ్యక్షులుగా జుబేర్‌, సురేశ్‌, ప్రధాన కార్యదర్శిగా వేల్పుల తిరుపతి, కోశాధికారిగా సాన కుమార్‌, కార్యవర్గ సభ్యులుగా వంశీ, భరత్‌, వెంకటేశ్‌, సురేశ్‌, గోపి, మహేశ్‌, వెంకటేశ్‌, హరీశ్‌, లక్ష్మణ్‌, శ్రీనివాస్‌, సాగర్‌, సతీశ్‌, అభిలాష్‌, తేజ, మహిళా ప్రతినిధులుగా శ్యామల, సంధ్యా, శ్రీలత, వనిత ఎన్నికయ్యారు.

మట్టి రవాణా అడ్డగింత

కాల్వశ్రీరాంపూర్‌: పెగడపల్లి గ్రామస్తులు ఆదివారం మట్టి రవాణాను అడ్డుకున్నారు. ఎల్ల మ్మ గుట్ట నుంచి పొకెల్యిన్‌ ద్వారా తవ్వుతూ టిప్పర్లలో నింపి తరలిస్తుండగా రైతులు, గ్రా మస్తులు అడ్డుకున్నారు. ప్రకృతి సంపదను కొ ల్లగొట్టి భవిష్యత్‌ తరాల మనుగడ ప్రశ్నార్థకం చేస్తున్నారని, పర్యావరణ సమతుల్యత నాశ నం చేస్తున్నారని ఆరోపించారు. అనంతరం మైనింగ్‌ అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు వచ్చి టిప్పర్లను పోలీస్టేషన్‌కు తరలించారు. బీజేపీ మండల మాజీ అధ్యక్షుడు, సింగిల్‌విండో మాజీ డైరెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి మా ట్లాడుతూ, పంచాయతీ పాలకవర్గం అలసత్వంతోనే మట్టి అక్రమంగా తరలిస్తున్నారన్నా రు. మట్టి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వే యాలని గ్రామస్తుడు అల్లం సదయ్య డిమాండ్‌ చేశారు. ఈవిషయమై ఎస్నైని వివరణ కోరగా.. మట్టి తరలిస్తున్న టిప్పర్లను మైనింగ్‌ అధికారులు తమకు అప్పగించారన్నారు.

కేజీ చికెన్‌ రూ.350

పెద్దపల్లిరూరల్‌: కోడిమాంసం ధరలకు రెక్కలొచ్చాయి. బాయిలర్‌ చికెన్‌ ధరలు భారీగా పెరిగాయి. చికెన్‌ కిలోకు ఆదివారం రూ.350(స్కిన్‌లెస్‌) ధర పలికింది. స్కిన్‌తో కేజీ ధర రూ.320తో విక్రయిస్తున్నట్లు చికెన్‌ సెంటర్‌ యజమానులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement