కాల్వశ్రీరాంపూర్: మండల కేంద్రంలోని బంకుల్లో పెట్రోల్ కొరత ఏర్పడింది. గ్యాస్ ఏజెన్సీల్లో ఎల్‌పీజీ సిలిండర్లు నో స్టాక్ అని బోర్డు దర్శనమిస్తోంది. ఇన్నాళ్లూ అవసరం మేరకు పెట్రోల్, వంటగ్యాస్ వినియోగదారుల ఇళ్లకు ఎప్పుడుపడితే అప్పడు చేరాయి. ప్రస్తుతం నిర్వాహకులు నోస్టాక్ అని బోర్డులు పెట్టి చేతులెత్తేశారు. చాలామంది ప్రజలు తమకు తెలిసినవారు, బంధువుల ఇళ్లలో వంటగ్యాస్ సిలిండర్ల కోసం వాకబు చేస్తున్నారు. యుద్ధం భయంతో అదనపు సిలిండర్లు ఉన్నా తమవద్ద లేవంటూ కొందరు చెబుతున్నారు. మరోవైపు.. ఇండెంట్ పెట్టినా స్టాక్ రావడంలేదని ఏజెన్సీ మండల కేంద్రంలోని ఇండేన్ గ్యాస్ నిర్వహకులు తెలిపారు. భారత్, హెచ్‌ీ ప గ్యాస్ ఓదెల, జమ్మికుంట ప్రాంతాల నుంచి సరఫరా చేస్తున్నారు. మండలంలో అత్యధికంగా కనెక్షన్లు ఉన్న ఇండేన్ సిలిండర్లు లభించక వినియోగదారులు ప్రత్యామ్నాయం కోసం విఫలయత్నం చేస్తున్నారు.


